కరువు కోరల్లో కారేపల్లి రైతాంగం.. పరిహారం చెల్లించాలి!

అఖిలభారత ఐక్య రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి కోలేటి నాగేశ్వరరావు డిమాండ్.. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా, వినతిపత్రం సమర్పణ

Published On
కరువు కోరల్లో కారేపల్లి రైతాంగం.. పరిహారం చెల్లించాలి!

 

 

కారేపల్లి, అక్టోబర్ 28 (లోకల్ గైడ్ న్యూస్):

వర్షాభావంతో పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన కారేపల్లి మండల రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి కోలేటి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులపై బుధవారం రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో కారేపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోలేటి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కరువు మండలంగా ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదని, క్షేత్రస్థాయిలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు. వర్షాలు లేక పంటలు ఎండిపోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడులు నష్టపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను గుర్తించి తక్షణ పరిహారం అందించడంతోపాటు గ్రామీణ పేదలకు అండగా నిలవాలని కోరారు. ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పరిహారం ఇవ్వాలి: వర్షాభావంతో పంటలు వేయని భూములకు ఎకరానికి రూ.30 వేల చొప్పున, ఎండిపోయిన వాణిజ్య పంటలకు ఎకరానికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులతో ప్రజలు ఆకలితో అలమటించకుండా రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. బావుల కింద సాగవుతున్న కొద్దిపాటి పంటలనైనా కాపాడేందుకు ఎలాంటి కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను తక్షణమే రైతులకు అందించి పంటలను రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు కారణంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఝాన్సీ, అఖిలభారత ఐక్య రైతు సంఘం ఖమ్మం డివిజన్ కార్యదర్శి గుగ్గులోతు తేజ నాయక్, పార్టీ మండల కార్యదర్శి గుమ్మడి సందీప్, మండల నాయకులు పులకాని సత్తిరెడ్డి, రాకేష్, సక్రు, రంగయ్య, శ్రీను, అనసూయ, సరోజిని తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కరువు కోరల్లో కారేపల్లి రైతాంగం.. పరిహారం చెల్లించాలి! కరువు కోరల్లో కారేపల్లి రైతాంగం.. పరిహారం చెల్లించాలి!
        కారేపల్లి, అక్టోబర్ 28 (లోకల్ గైడ్ న్యూస్): వర్షాభావంతో పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన కారేపల్లి మండల రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అఖిలభారత
పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 58 సిసిటివి కెమెరాల ప్రారంభించిన శంషాబాద్ జోన్ డీసీపీ బి. రమేష్.
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
అమర పోలీసు వీరులకు ఘన నివాళి: వికారాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో బృహత్ రక్తదాన శిబిరం
_దుబాయ్ వ్యాపార పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ ప్రతినిధులు
త్రోబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రవికుమార్. క్రీడాకారుల ప్రోత్సాహమే లక్ష్యం..