పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

అసువులు బాసిన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం

సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ
Published On
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

IMG-20261028-WA0091పెద్దపల్లి జిల్లా అక్టోబర్ 28 (లోకల్ గైడ్ )
విది నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని పెద్దపల్లి డిసిపి భూక్య రామ్ రెడ్డి అన్నారు. బుధవారం  సర్కిల్ పరిధిలోని సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, పొత్కపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పోలీసులు సిఐ పోన్నమనేని రంజిత్ రావు ఆధ్వర్యంలో  అమరవీరుల  దినోత్సవాన్ని పురస్కరించుకొని   సైకిల్ ర్యాలీను తెలంగాణ చౌరస్తా నుండి డీసీపీ జెండా ఊపి  ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, నిత్యం విధి నిర్వహణలో ఉండి ప్రజలకు సేవలను అందిస్తున్న పోలీసులు పలు సందర్భాల్లో అశువులు బాయడం బాధాకరమని పోలీస్ కుటుంబాలకు  అండగా ఉంటామని అన్నారు. అనంతరం ర్యాలీ తాసిల్ కార్యాలయం, సివిల్ ఆస్పత్రి, శివాలయం, పాత జెండా, పోలీస్ స్టేషన్, రాజీవ్ రహదారి నుండి పూసాల ఎక్స్ రోడ్ నుండి వివేకానంద స్కూల్ వరకు చేరిన ర్యాలీ అనంతరం తిరిగి తెలంగాణ చౌరస్తా కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఎస్సైలు చంద్రకుమార్, మధుకర్ , గట్ల సుధాకర్ , సర్కిల్ పరిధిలోని పోలీస్ లతోపాటు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, సుల్తానాబాద్ మండల పాత్రికేయులు, క్రీడాకారులు విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి
అమర పోలీసు వీరులకు ఘన నివాళి: వికారాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో బృహత్ రక్తదాన శిబిరం
_దుబాయ్ వ్యాపార పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ ప్రతినిధులు
త్రోబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రవికుమార్. క్రీడాకారుల ప్రోత్సాహమే లక్ష్యం..
గుడిపూడి తిరుమల రావు జన్మదిన వేడుకల్లో రామకృష్ణాపురం యూత్ సందడి!
ఘనంగా 'అమ్మ రక్షక పురస్కారం' ప్రదానం.. విశేష సేవలందించిన సిఐ రాజశేఖర్ రెడ్డి కి సత్కారం.