శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు  ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ నవదుర్గా ఉత్సవ కమిటీ 

అమ్మవారికి ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్న ప్రసాదాల వితరణ

Published On
శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు  ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ నవదుర్గా ఉత్సవ కమిటీ 



 

ఖమ్మం అక్టోబర్ 17: లోకల్ గైడ్:
ఖమ్మం పాకబండ బజార్ బేడ బుడగ జంగాల కాలనీలో శ్రీ నవ దుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయని. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, భవానీ స్వాములతో బజన కార్యక్రమం నిర్వహించడంతో పాటు భక్తులకు మరియు భవానీ స్వాములకు అన్న ప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నవదుర్గా ఉత్సవ కమిటీ చైర్మన్ కడవంచి బిచ్చాపతి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.దేవీ నవరాత్రి ఉత్సవాలు  భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యతను చాటుతాయని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అన్న ప్రసాదాల వితరణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. శ్రీ నవదుర్గా ఉత్సవ కమిటీ బేడ బుడగ జంగాల కాలనీ 4వ వార్షికోత్సవం వైస్ చైర్మన్ పస్తం తిరుపతిరావు, సిరిగిరి కృష్ణంరాజు, సాయి, మణికంఠ, చెర్రీ, తరుణ్, యస్.సాయి, దుర్గా, భవానీ, అన్నపూర్ణ, చాముండేశ్వరి, మారేమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి  జిల్లాస్థాయి భజన పోటీలలో దమగాన్ పూర్ కు రెండవ బహుమతి 
లోకల్ గైడ్:మద్దూర్ నారాయణ పేట జిల్లా దన్వాడ మండలం  గున్ముకుల   గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 60 గ్రామాలు పాల్గొనడం జరిగింది ఆతరువాత డ్ర వేయడం జరిగింది...
గేట్ కారేపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కల్లూరు సర్పంచ్‌ చెక్‌ పవర్‌ ఫ్రీజ్‌పై సుంకేట పోశెట్టి ఆవేదన ఎస్సీ సర్పంచ్‌పై వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణలు.. చెక్‌ పవర్‌ పునరుద్ధరించాలని డిమాండ్‌.
సీనియర్ నాయకులు కొట్టేరు శ్రీనివాస రెడ్డి గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
నేడు డిప్యూటీ సీఎం పర్యటనకు సింగరేణి సర్పంచులు సన్నద్ధం కావాలి! రంజిత్ కుమార్ 
దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు  ఘనంగా నిర్వహిస్తున్న శ్రీ నవదుర్గా ఉత్సవ కమిటీ