- District News
- త్రోబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రవికుమార్. క్రీడాకారుల ప్రోత్సాహమే లక్ష్యం..
త్రోబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రవికుమార్. క్రీడాకారుల ప్రోత్సాహమే లక్ష్యం..
క్రీడలు అంటే ప్రాణం....
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
క్రీడల అభివృద్ధికి,క్రీడాకారుల ప్రోత్సాహానికి నిరంతరం కృషి చేసే వ్యక్తిగా గుర్తింపు పొందిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పులాల రవికుమార్ తెలంగాణ రాష్ట్ర త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపిక కావడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈనెల 25న హైదరాబాదులో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశానికి వివిధ జిల్లాల నుండి హాజరైన జిల్లా అసోసియేషన్ల అధ్యక్ష,కార్యదర్శులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.పోలీస్ శాఖలో బాధ్యతలు నిర్వహించిన అనుభవంతో పాటు క్రీడల పట్ల ఆయనకు ఉన్న మక్కువ,క్రీడాకారుల పట్ల చూపే ఆదరణ ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.
క్రీడాకారులకు ఎల్లప్పుడు అండగా...
క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం,వారికి తగిన ప్రోత్సాహం అందించడం ఎంతో ముఖ్యమని రవికుమార్ భావిస్తుంటారు.ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు,ఆర్థిక సహకారం,మార్గదర్శకత్వం లేక వెనుకబడిపోతున్న క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ఉద్యోగ విరమణ అనంతరం కూడా ఆయన నిర్విరామంగా కృషి చేస్తున్నారు.క్రీడాకారులు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకొని,వారికి అండగా నిలుస్తు,పోటీల్లో రాణించేలా ప్రోత్సహించడం ద్వారా క్రీడా రంగానికి మరింత సేవ చేయాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు.
క్రీడలు అంటే ఎంతో ఇష్టం....
క్రీడలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కావని,శారీరక దృఢత్వం,మానసిక ప్రశాంతత,క్రమశిక్షణ,పట్టుదల,నాయకత్వ లక్షణాలను పెంపొందించే గొప్ప సాధనాలని క్రీడాభిమానులు పేర్కొంటున్నారు.ముఖ్యంగా యువత చదువుతో పాటు క్రీడల్లోను రాణించాలని,గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తు లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావచ్చనే సందేశం ఆయన ఆలోచనలతో ప్రతిబింబిస్తున్నాయి.
త్రో బాల్ అభివృద్ధే లక్ష్యం..
తెలంగాణ రాష్ట్ర త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవికుమార్ ఎంపిక కావడంతో రాష్ట్రంలో త్రోబాల్ క్రీడకు మరింత ప్రోత్సాహం లభిస్తుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం,శిక్షణ శిబిరాలను నిర్వహించడం,జిల్లా స్థాయి నుండి రాష్ట్ర,జాతీయ స్థాయి పోటీల వరకు క్రీడాకారులు రాణించేలా ప్రోత్సహించడం వంటి కార్యక్రమాల ద్వారా త్రోబాల్ క్రీడను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నారు.క్రీడాకారులు క్రీడా రంగానికి బలం వారి విజయాలే అసలైన గుర్తింపు అనే స్ఫూర్తితో క్రీడాకారులకు అండగా నిలుస్తు,త్రోబాల్ అభివృద్ధికి రవికుమార్ మరింత సేవలందించాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.రాష్ట్ర త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తు ఆయన నాయకత్వంలో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
