అక్షరమే ఆయుధం.. విద్యే అభివృద్ధికి మార్గం

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా విద్యార్థుల అవగాహన ర్యాలీ

Published On
అక్షరమే ఆయుధం.. విద్యే అభివృద్ధికి మార్గం

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 8, లోకల్ గైడ్ న్యూస్ : అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని కారేపల్లి మండల కేంద్రంలో మంగళవారం విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో కేజీబీవీ, జడ్పీహెచ్‌ఎస్, ఆదర్శ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అంబేద్కర్ సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు విద్యార్థులు ప్లకార్డులు, బ్యానర్లతో ర్యాలీ నిర్వహిస్తూ “అక్షరమే ఆయుధం.. విద్యే అభివృద్ధికి మార్గం”, “అందరికీ విద్య.. అందరి బాధ్యత” అంటూ నినాదాలు చేశారు. విద్య ప్రాముఖ్యతను చాటుతూ ప్రజల్లో అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. విద్య ద్వారానే వ్యక్తి ఆత్మవిశ్వాసం పెరిగి సమాజం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని విద్యార్థులు సందేశాన్ని వినిపించారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ పద్మ, విద్యాశాఖ అధికారి డీ. జయరాజు మాట్లాడుతూ వ్యక్తులు, కుటుంబాలు, సమాజ అభివృద్ధిలో అక్షరాస్యత ఎంతో కీలకమన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తూ విద్య ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. “అందరికీ విద్య” అనే లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
అక్షరాస్యత కేవలం చదవడం, రాయడం నేర్చుకోవడమే కాకుండా వ్యక్తికి తన హక్కులు, బాధ్యతలు, అవకాశాలపై అవగాహన కల్పిస్తుందని పేర్కొన్నారు. నిరక్షరాస్యత కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని, తమ పరిసరాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు విద్య విలువను ప్రజలకు తెలియజేయడంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అక్షరాస్యతతోనే సమాజంలో చైతన్యం, అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ ఝాన్సీ సౌజన్య, ఐకేపీ సభ్యులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వాజేడు మండలం లోని వివిధ పాఠశాలలకు బూట్లు, బెల్ట్స్,బ్యాగ్స్ అందించిన ఎం.ఈ.ఓ వెంకటేశ్వర్లు.                .   వాజేడు మండలం లోని వివిధ పాఠశాలలకు బూట్లు, బెల్ట్స్,బ్యాగ్స్ అందించిన ఎం.ఈ.ఓ వెంకటేశ్వర్లు.                .  
                              .                             వాజేడు,లొకల్ గైడ్ ప్రతినిధి :-  ములుగు జిల్లా వాజేడు మండలం లోని ప్రభుత్వ స్కూల్స్ మండల పరిషత్, జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలలకు,ఆశ్రమ పాఠశాలలకు
ప్రజావాణిలో 68 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
విద్యార్థులతో మంచిర్యాల ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు. 
సుల్తానాబాద్ ఎస్ జి ఎఫ్ జోనల్ లెవెల్ అథ్లెటిక్స్ లో 28 పథకాలు సాధించిన  కేరళ మోడల్ హై స్కూల్ విదార్థులు ,
అయోధ్యలో అక్టోబర్ 4, 5 తేదీల్లో ఎన్‌యూజే (ఐ) జాతీయ సమావేశాలు
గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు
శంషాబాద్ లో వినాయక పూజలో కార్తీక్ రెడ్డి.