- District News
- నాడు ఫ్రెండ్లీ పోలీసు... నేడు రేవంత్ పోలీసు
నాడు ఫ్రెండ్లీ పోలీసు... నేడు రేవంత్ పోలీసు
హామీల అమలు కోరితే కేసులు పెడతారా?
నారాయణపేట సెప్టెంబర్ 7:
చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో మారు గుర్తు చేస్తూ సోమ వారం గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రియాంక కు విన తిపత్రం సమర్పించారు. అంతకు ముందు యాద్గీర్ రోడ్డులోని మాజీ ఎమ్మెల్యే నివాసం నుంచి కలెక్టరేట్ వరకు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి భారీ ఎత్తు న ర్యాలీ నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో ఉత్సాహంగా సాగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్. రాజేంద ర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్ని కల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారం టీలు, 420 హామీలను నమ్మి ప్రజలు అధికారాన్ని అప్పగించారని అన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాల యాపన చేస్తున్నారని విమ ర్శించారు.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉందని ఆయన అన్నారు. రైతులు, మహిళ లు, యువత, నిరుద్యోగు లు, ఉద్యోగులు, పేదలు, వృద్ధులు, వికలాంగులు, రైతు కూలీలు వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాల ని డిమాండ్ చేశారు. ఎన్నిక ల హామీలను అమలు చేయాలని ప్రజల తరఫున ప్రభుత్వాన్ని మరోమారు ప్రశ్నిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌కు హటావో తెలంగా ణకు బచావో అని యావ త్తు తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగు ణంగా ప్రభుత్వం పనిచే యాలని, లేనిపక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని హెచ్చరిం చారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలుపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునేలా చూడాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లో సమాచార బోర్డు పై అధికా ర్ల పేర్లు కాగితాలపై రాసి ఉండడం, కలెక్టర్ పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు మొలసి ఉండడం, మంచి నీటి సదుపాయం లేని విష యాలపై అసహనం వ్యక్తం చేస్తూ జిల్లా కార్యాలయా లు అంటే ఇలాగానే ఉండేది అని విస్మయం వ్యక్తం చేశారు. ర్యాలీ మద్యలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బిఆర్ ఎస్ శ్రేణులు ప్రయత్నించ గా పోలీసులు అడ్డుకున్నా రు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతిని ధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాడు ఫ్రెండ్లీ పోలీసు... నేడు రేవంత్ పోలీసు...
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు వ్యవస్థను " ఫ్రెండ్లీ పోలీసు" గా ప్రజలకు చేరు వ చేస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అది "రేవంత్ పోలీసు"గామారిపోయిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్య క్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్‌రెడ్డి విమ ర్శించారు. ప్రభుత్వం ప్రజల కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరడం కూడా రేవంత్ రెడ్డి ప్రభు త్వంలో తప్పుగా మారిపో యిందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే, హామీల అమలు కోసం డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులు జోక్యం చేసుకు ని కేసులు నమోదు చేయ డం ఏమిటని ప్రశ్నించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలనే గుర్తు చేస్తూ తమ పార్టీ ఎమ్మెల్యేలు టీషర్టులపై రాసుకుని అసెంబ్లీకి రావ డంలో తప్పేముందని ఎస్.రాజేందర్‌రెడ్డి ప్రశ్నిం చారు. ఎన్నికల సమయం లో ప్రజలకు ఇచ్చిన హామీ లను గుర్తు చేయడాన్ని కూడా ప్రభుత్వం అడ్డుకోవ డం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. టీషర్టులపై హామీలను రాసుకుని అసెంబ్లీకి వచ్చిన తమ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారని, అయితే అదే హామీలు తెలంగాణ ప్రజల గుండెల్లో, వారి మనసుల్లో ఉన్నాయ ని పేర్కొన్నారు. పోలీసుల ను ఉపయోగించి టీషర్టుల తో వచ్చిన తమ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకోవ చ్చు కానీ ప్రజల మనసుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అమల కు నోచుకొని హామీలను ఎలాఅడ్డుకుంటారు...వాటిని ఎలా చెడగొడతారు అని ఎస్.రాజేందర్‌రెడ్డి ప్రశ్నిం చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్న ప్రతిపక్షాలపై కేసులు పెట్ట డం, పోలీసులతో అడ్డుకో వడం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వా న్ని ప్రశ్నించడం ప్రతిపక్షాల హక్కు అని, ప్రజలకు ఇచ్చి న హామీల అమలుపై ప్రశ్నిం చే గొంతులను అణచివే యడం ద్వారా ప్రజా సమ స్యలు పరిష్కారం కావని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేయడం మా బాధ్యత అని హామీలు అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని పోలీసు కేసులతో ప్రజల ప్రశ్నించే గొంతును అణచివేయలేరు అని ఆయన స్పష్టం చేశారు.
ఫోటో రైట్ అప్:7.నిరసన ర్యాలీ చేస్తున్న బి ఆర్ ఎస్ శ్రేణులు,8.కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తున్న ఎస్ ఆర్ రెడ్డి
______________________
