అయోధ్యలో అక్టోబర్ 4, 5 తేదీల్లో ఎన్‌యూజే (ఐ) జాతీయ సమావేశాలు

జర్నలిస్టుల సమస్యలపై విస్తృత చర్చ.. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతులు
Published On
అయోధ్యలో అక్టోబర్ 4, 5 తేదీల్లో ఎన్‌యూజే (ఐ) జాతీయ సమావేశాలు

 

 

ఆదిలాబాద్ లోకల్ గైడ్ సెప్టెంబర్ 21 :

అయోధ్యలో అక్టోబర్ 4, 5 తేదీల్లో నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) (ఎన్‌యూజే–ఐ) నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంతో పాటు యూనియన్ కౌన్సిల్ సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నట్లు టీఎస్‌జేయూ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగౌని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తోకల, ఎన్‌యూజే–ఐ జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్ తెలిపారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై విస్తృతంగా చర్చించనున్నట్లు వారు పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రాలు సమర్పించేందుకు సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ సమావేశాలకు ఎంయూజే(ఐ) జాతీయ అధ్యక్షులు సురేష్ శర్మ, జాతీయ ప్రధాన కార్యదర్శి త్రియుగ్ నారాయణ్ తివారీ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి టీఎస్‌జేయూ, ఎన్‌యూజే–ఐ ప్రతినిధులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.

Tags:

About The Author

Latest News

వాజేడు మండలం లోని వివిధ పాఠశాలలకు బూట్లు, బెల్ట్స్,బ్యాగ్స్ అందించిన ఎం.ఈ.ఓ వెంకటేశ్వర్లు.                .   వాజేడు మండలం లోని వివిధ పాఠశాలలకు బూట్లు, బెల్ట్స్,బ్యాగ్స్ అందించిన ఎం.ఈ.ఓ వెంకటేశ్వర్లు.                .  
                              .                             వాజేడు,లొకల్ గైడ్ ప్రతినిధి :-  ములుగు జిల్లా వాజేడు మండలం లోని ప్రభుత్వ స్కూల్స్ మండల పరిషత్, జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలలకు,ఆశ్రమ పాఠశాలలకు
ప్రజావాణిలో 68 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
విద్యార్థులతో మంచిర్యాల ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు. 
సుల్తానాబాద్ ఎస్ జి ఎఫ్ జోనల్ లెవెల్ అథ్లెటిక్స్ లో 28 పథకాలు సాధించిన  కేరళ మోడల్ హై స్కూల్ విదార్థులు ,
అయోధ్యలో అక్టోబర్ 4, 5 తేదీల్లో ఎన్‌యూజే (ఐ) జాతీయ సమావేశాలు
గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు
శంషాబాద్ లో వినాయక పూజలో కార్తీక్ రెడ్డి.