కాళోజీ అడుగుజాడల్లో నడవాలి: శిక్షణా సహాయ కలెక్టర్ పారస్ కుమార్

ఘనంగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు

Published On
కాళోజీ అడుగుజాడల్లో నడవాలి: శిక్షణా సహాయ కలెక్టర్ పారస్ కుమార్

 

ఖమ్మం, సెప్టెంబర్- 9: లోకల్ గైడ్:
తెలంగాణ వైతాళికుడు, ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి (తెలంగాణ భాషా దినోత్సవం) వేడుకలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి శిక్షణా సహాయ కలెక్టర్ పారస్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పారస్ కుమార్ మాట్లాడుతూ, సమాజంలోని అన్యాయాలను, అక్రమాలను తన కలం బలం ద్వారా ఎండగట్టిన మహోన్నత వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి పరిరక్షణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజాచైతన్యమే ఊపిరిగా జీవించిన కాళోజీ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని, ఆయన చూపిన బాటలో, అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, కేర్ టేకర్ వెంకన్న, సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని కాళోజీ నారాయణరావు సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.
.

Tags:

About The Author

Latest News

తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి
        మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు
జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళోజి జయంతి వేడుకలు 
దళిత అసెంబ్లీ స్పీకర్ ని ఉద్దేశిస్తూ అవమానకరంగా,జుగుప్సాకరమైన పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు  పై చట్టప్రకారం ఖఠిన చర్యలు తీసుకోవాలి
_విద్యా విధానంలో యోగ–బ్రహ్మవిద్యకు స్థానం కల్పించాలి. _కేజీ నుంచి పీజీ వరకు యోగను పాఠ్యాంశంగా చేర్చాలి
నల్గొండ బస్‌స్టాండ్‌కు మోక్షం .
కాళోజీ అడుగుజాడల్లో నడవాలి: శిక్షణా సహాయ కలెక్టర్ పారస్ కుమార్
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు గాదెపాడులో భారీ స్పందన