గాంధీచౌక్ వర ప్రదాత శ్రీషిర్డీసాయి మందిరంలో సామూహక కుంకుమ పూజ

Published On
గాంధీచౌక్ వర ప్రదాత శ్రీషిర్డీసాయి మందిరంలో సామూహక కుంకుమ పూజ

ఖమ్మం,ఆగస్టు,28: లోకల్ గైడ్:
ఖమ్మం గాంధీచౌక్ వర ప్రదాత శ్రీషిర్డీసాయి మందిరంలో శ్రావణ శుక్రవారం రోజు సామూహక కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు . అధిక సంఖ్యలో మహిళా లు పాల్గొని విజయవంతం చేశారు . ఎంతో పవిత్రమైన శ్రావణ శుక్రవారం నాడు ఈ సామూహక కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం దీనికి అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందని ఆలయ చైర్మన్ డాక్టర్ వేములపల్లి వెంకటేశ్వర రావు తెలిపారు . ఆ అమ్మవారి కటాక్షం ఉంది ధనవృద్ధి , ఆర్థిక స్థిరత్వం , వ్యాపారాభివృద్ధి , కార్యసిద్ధి & ఐశ్వర్యప్రాప్తి అందరిపై ఉండాలని ఆకాంక్షించారు . సుమారు 200 మంది మహిళలు పాల్గొన్నారు . ఈ కార్యక్రమం అర్వపల్లి నిరంజన్ , పి వి ప్రసాద్ , కే జగన్ మోహన్ రావు , గన్నవరపు నాగేశ్వరరావు , శీలం హనుమంతరావు , కాకరపర్తి సూర్యనారాయణ , బోనగిరి ఉమేష్ , సీమకుర్తి వెంకటేశ్వరరావు , మందిర అర్చకులు ఇంద్రగంటి కిరణ్ శర్మ , జనార్ధన చార్యులు , రామడుగు నరసింహాచార్యులు , వరప్రదాత విష్ణు సభ్యులు , సాయిభజన మండలి సభ్యులు , వివిధ దేవాలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు .

Tags:

About The Author

Latest News

రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి: రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
సిద్దిపేట, ఆగస్టు 28(లోకల్ గైడ్): జిల్లాలో నిర్మాణంలో ఉన్న రెండు పడకల గదుల ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు అందించాలని జిల్లా కలెక్టర్ కె....
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.
గాంధీచౌక్ వర ప్రదాత శ్రీషిర్డీసాయి మందిరంలో సామూహక కుంకుమ పూజ
తమ్మునికి రాఖీ కట్టిన అక్కలు అనుబంధానికి ప్రతీకగా రాఖీ వేడుకలు
లక్కీ డ్రా లో-  లక్కీగా ఇందిరమ్మ ఇల్లు 
రాజకీయాలకు అతీతంగా రాఖీ బంధం
హరీశ్ రావు సంతోషిమాత ఆలయంలో పూజలు అనంతరం రాఖీ కట్టిన మహిళా నాయకులు