హరీశ్ రావు సంతోషిమాత ఆలయంలో పూజలు అనంతరం రాఖీ కట్టిన మహిళా నాయకులు

Published On
హరీశ్ రావు సంతోషిమాత ఆలయంలో పూజలు అనంతరం రాఖీ కట్టిన మహిళా నాయకులు

IMG-20260828-WA0268సిద్దిపేట ఆగస్ట్ 28( లోకల్ గైడ్):

శ్రావణ మాసం, రాఖీ పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ఉద్యాపన పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ శ్రావణ మాసం అమ్మవారికి, ఆడపడుచులకు ఎంతో పవిత్రమైన, శ్రేష్ఠమైన మాసమని అన్నారు. శ్రీ సంతోషిమాత అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యమని పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.అనంతరం ఆలయ అర్చకులు, ఈఓ హరీశ్ రావుకు అమ్మవారి ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వదించారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, పార్టీ మహిళా నాయకులు హరీశ్ రావుకు రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆడపడుచులు, నాయకులతో హరీశ్ రావు ఆప్యాయంగా ముచ్చటించారు.

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.