- District News
- Khammam
- 800 మీటర్ల పరుగులో పేరుపల్లి నైనిష్యకు బంగారు పతకం
800 మీటర్ల పరుగులో పేరుపల్లి నైనిష్యకు బంగారు పతకం
డీఏవీ నేషనల్ స్పోర్ట్స్-2026 రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం
ఖమ్మం జిల్లా, కారేపల్లి , ఆగష్టు 22 ( లోకల్ గైడ్ ) :
డీఏవీ నేషనల్ స్పోర్ట్స్-2026లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన తాటి నైనిష్య ప్రతిభ చాటింది. 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. పేరుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న నైనిష్య, డీఏవీ బీడీఎల్ భానూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచింది. 800 మీటర్ల పరుగులో ప్రత్యర్థులను అధిగమించి మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. పేరుపల్లి గ్రామానికి చెందిన తాటి వెంకటేశ్వర్లు కుమార్తె అయిన నైనిష్య క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ పాఠశాలకు, పేరుపల్లి గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిన నైనిష్యను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీల్లో రాణించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్నత విజయాలు సాధించాలని ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆకాంక్షించారు.
