- District News
- Nalgonda
- మున్నూరు కాపు కుల బంధువులు అందరూ భవన నిర్మాణంలో పాల్పంచుకోవాలి. భవన నిర్మాణం కోసం నిధులు సేకరించేం...
మున్నూరు కాపు కుల బంధువులు అందరూ భవన నిర్మాణంలో పాల్పంచుకోవాలి. భవన నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు తాము సహకరిస్తాం.
మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ ట్రస్ట్ నిర్మాణ భూమి పూజ.

మున్నూరు కాపు భవన నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు తాము సహకరిస్తామని, శాసనమండలి మాజీ చైర్మన్ నీతి విద్యాసాగర్ ,మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ లు కోరారు.
శుక్రవారం నల్లగొండ పట్టణంలోని స్థానిక ఎన్.ఆర్.ఎస్ గార్డెన్స్ సమీపంలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ ట్రస్టు నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు శ్రీ నేతి రఘుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ , మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ లు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు .
ఈ భవన నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు తాము సహకరిస్తామని తెలియజేశారు నల్గొండ జిల్లాలో ఉన్న మున్నూరు కాపు కుల బంధువులు అందరూ ఈ భవన నిర్మాణంలో పాలుపంచుకోవాలని అన్నారు.గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే చదువుకునే విద్యార్థుల కోసం హాస్టల్ సదుపాయం కల్పిస్తామని అన్నారు .తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపు ఎమ్మెల్యేలు ఎంపీలు వివిధ హోదాలో ఉన్న రాజకీయ నాయకుల నుండి ఈ భవన నిర్మాణం కోసం నిధులు సేకరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రధాన కార్యదర్శి తోకల వెంకటకృష్ణ కోశాధికారి నేతి ఉమామహేశ్వర్, గౌరవ అధ్యక్షులు కాటం సునీల్ ఉపాధ్యక్షులు మేకల వెంకన్న, సహాయ కార్యదర్శి రామగిరి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు కంచనపల్లి జవహర్ లాల్, టీ ఎం జె కె ఎఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు తూడి జనార్దన్ పటేల్ ,నాగులంచ స్వామి ట్రస్ట్ బోర్డు సభ్యులు వాసుదేవుల వెంకట నరసయ్య ,శేషనాల రఘువీర్ వొలి సమీర్ కుమార్, గాలి వెంకటేశ్వరరావు, వైద్యం వెంకటేశ్వర్లు కేసిడి వెంకట నరసయ్య, నాగులపల్లి శ్యాంసుందర్, జువాజీ ఇంద్రయ్య,కంచి సత్యనారాయణ, పందిరి వేణు,వీడియో జర్నలిస్ట్ చేపూరి రవి,సంఘం నాయకులు పందిరి వెంకటేశ్వర మూర్తి ,సుధాకర్ ,వసంతరావు ,పంతులు శ్రీనివాస్, ప్రవీణ్, పజ్జురి గిరి, తదితరులు పాల్గొన్నారు.
