పోలీస్ అకాడమీలో రాజాబహద్దూర్ వెంకట రామిరెడ్డి 157వ జయంతి వేడుకలు

Published On
పోలీస్ అకాడమీలో రాజాబహద్దూర్ వెంకట రామిరెడ్డి 157వ జయంతి వేడుకలు

WhatsApp Image 2026-08-22 at 17.59.07

రాజాబహద్దూర్ వెంకట రామిరెడ్డి 157వ జయంతి వేడుకలు రాజాబహద్దూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో అకాడమీ అధికారులు  ఆర్‌బీవీఆర్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అకాడమీ ప్రాంగణంలోని రాజాబహద్దూర్ వెంకట రామిరెడ్డి విగ్రహానికి అకాడమీ అధికారులు, ఆర్‌బీవీఆర్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధులు, పోలీస్ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
పోలీస్ వ్యవస్థకు వెంకట రామిరెడ్డి ఆదర్శం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కె.ఆర్.కె. ప్రసాద్ మాట్లాడుతూ, రాజాబహద్దూర్ వెంకట రామిరెడ్డి పేరు తెలంగాణ పోలీస్ అకాడమీకి, మొత్తం పోలీస్ వ్యవస్థకు నిరంతర స్ఫూర్తినిస్తోందని అన్నారు.
పేదలు, బలహీన వర్గాల ప్రజలకు వెంకట రామిరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని, పోలీస్ సేవలకు ఆయన ఒక నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ శిక్షణార్థుల సంక్షేమం కోసం ఆయన ఏర్పాటు చేసిన నిధి ద్వారా శిక్షణార్థుల పట్ల ఆయనకున్న శ్రద్ధ, దూరదృష్టి స్పష్టంగా తెలుస్తుందని తెలిపారు.
అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆయన పేరుతో తెలంగాణ పోలీస్ అకాడమీని మరింత అభివృద్ధి చేసుకోవడం గర్వకారణమని, భవిష్యత్ పోలీస్ అధికారులకు ఆయన జీవితం, సేవలు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
విద్యారంగంలో విశేష సేవలు:::::
ఆర్‌బీవీఆర్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడు కొండ లక్ష్మీకాంతరెడ్డి మాట్లాడుతూ, రాజాబహద్దూర్ వెంకట రామిరెడ్డి విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు.
విద్య ద్వారా సమాజ అభివృద్ధికి బాటలు వేసేందుకు అనేక విద్యాసంస్థలను ఏర్పాటు చేసి, ఎంతోమందికి విద్యావకాశాలు కల్పించిన ఆయన సేవలను కొనియాడారు. సమాజ సేవ, విద్యాభివృద్ధి, ప్రజాసేవలో ఆయన చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు.అనంతరం ఆర్‌బీవీఆర్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడు కొండ లక్ష్మీకాంతరెడ్డి, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తిరుపతి రెడ్డిలకు తెలంగాణ పోలీస్ అకాడమీ తరఫున జ్ఞాపికలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కె.ఆర్.కె. ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్లు వేమా శ్రీనివాసరెడ్డి, యార్లగడ్డ రాంబాబు, వేముల శ్రీనివాసరావు, నరహరి, డీఎస్పీలు ఆదూరి శ్రీనివాసరావు, కృష్ణ, తోట శ్రీనివాసులు, తిరుపతి, జగదీశ్వర్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, అకాడమీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
మహిళా సంఘాలకు అండగా ప్రభుత్వం.. వడ్డీలేని రుణాలు, ఉపాధి అవకాశాలు. సత్తుపల్లిలో ఇందిర మహిళాశక్తి సదస్సు లో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన మంత్రి...
వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...
తెలంగాణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.  
విద్యార్థుల చదువులకు నరసింహారావు–ప్రసన్న లక్ష్మి దంపతుల చేయూత
మిషన్ భగీరథ నీటి సరఫరా లో పంప్ హౌస్ లో సాంకేతిక అంతరాయం