- District News
- Khammam
- వధూవరులకు పట్టు వస్త్రాలతో ఆశీర్వాదం.. సర్పంచ్ ఉమా నరేష్!
వధూవరులకు పట్టు వస్త్రాలతో ఆశీర్వాదం.. సర్పంచ్ ఉమా నరేష్!
Published On
By Ram Reddy
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 5, లోకల్ గైడ్ న్యూస్ : మాదారం గ్రామంలో అజ్మీర రవి పద్మ దంపతుల కుమార్తె విహా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాదారం గ్రామ సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ హాజరై నూతన వధూవరులను పట్టు వస్త్రాలతో ఆశీర్వదించారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కిలారి అప్పారావు, గుర్రం నర్సయ్యతో పాటు వార్డు సభ్యులు అజ్మీరా శారద, రజిని, బాలాజీ, సంధ్య, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. విహా వేడుకల సందర్భంగా మాదారం గ్రామంలో సందడి నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు నూతన దంపతులను ఆశీర్వదించి వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
17 Sep 2026 16:11:08
గండిపేట్, సెప్టెంబర్ 17 లోకల్ గైడ్:
నార్సింగి సర్కిల్ పరిధిలోని కోకాపేట్ ఐసీసీ బ్యాంకు వెనుక గాయత్రి ఎన్క్లేవ్, సుమ్మి రెసిడెన్సి ప్రాంతంలో బాలగణపతి యూత్
