- District News
- నేడు వనపర్తికి మంత్రి సీతక్క రాక.
నేడు వనపర్తికి మంత్రి సీతక్క రాక.
మంత్రులచే పీఆర్ రోడ్లకు పైలాన్ ఆవిష్కరణ.
---
వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి సెప్టెంబర్ 4:
వనపర్తి జిల్లా కేంద్రానికి రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క రానున్నారని శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ఒక లిఖిత పూర్వక ప్రకటన విడుదల చేశారు. హమ్ ప్రా జెక్టులో భాగంగా రూ. 69 కోట్లతో నిర్మించనున్న పంచాయతీరాజ్ శాఖ రోడ్లకు సంబంధించిన పైలాన్ ను మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి , వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి , డిసిసి అధ్యక్షులు శివసేనారెడ్డి లు ఆవిష్కరణ చేస్తారని ఒక ప్రకటనలో తెలిపారు.
వనపర్తి క్యాంపుకార్యాలయంకు మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రేస్ పార్టీ శ్రేణులు చేరుకోవాలని తెలిపారు. అదే విధంగా వెయ్యి రోజుల ప్రజా పాలనలో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, అలాగే ప్రతిపక్ష నాయకులు హోదాలో ఉండి 1000 రోజులు అసెంబ్లీకి రాని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వనపర్తి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల , మండల కేంద్రాల నుంచి భారీ ఎత్తున మధ్యాహ్నం 2 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుప్పు నిచ్చారు.అదే విధంగా కొల్లాపూర్ నుంచి వనపర్తి కి వచ్చే మంత్రి కి భారీ ర్యాలీతో స్వాగతం పలుకనున్నట్లు తెలిపారు.
