ప్రభుత్వ, వైద్య కళాశాల సీట్లు సాధించిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం

గుడ్ మార్నింగ్ గ్రామర్ హైస్కూల్ ఆధ్వర్యంలో వేడుక

Published On
ప్రభుత్వ, వైద్య కళాశాల సీట్లు సాధించిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం


 

భూపాలపల్లి :(లోకల్ గైడ్ ప్రతినిధి)

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రతిష్టాత్మక వైద్య కళాశాలల్లో సీట్లు సాధించి ప్రతిభ చాటిన మాజీ విద్యార్థులను స్థానిక 'గుడ్ మార్నింగ్ గ్రామర్ హైస్కూల్' ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. పాఠశాల 32 ఏళ్ల ప్రయాణంలో ఈ విజయం ఒక మరపురాని ఘట్టమని ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, ప్రస్తుత విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు స్థానిక శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సన్మానం పొందిన విద్యార్థులు మధుశ్రీ ఠాకూర్
,రిష్వంత్ కే,రుచిక లు 
సన్మానం పొందిన విద్యార్థులు పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. "గ్రామీణ ప్రాంత పాఠశాల పిల్లలు కూడా పోటీ పరీక్షల్లో సాధించగలరనే ధైర్యాన్ని ఈ పాఠశాల మాకు ఇచ్చింది. ఇక్కడ కేవలం పుస్తక పాఠాలు మాత్రమే కాకుండా క్రమశిక్షణ, అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసే పట్టుదలను నేర్పించారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కూడా పెద్ద కలలు కని, కష్టపడి చదివి కుటుంబానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలి" అని వారు పిలుపునిచ్చారు.
1994లో ప్రారంభమైన ఈ పాఠశాల గ్రామీణ విద్యార్థులను ఉన్నత సీట్లలో కూర్చోబెట్టగలదని ఈ రోజు మరోసారి నిరూపించిందని పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Latest News

బియ్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథుడి ప్రతిష్ట  బియ్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథుడి ప్రతిష్ట 
        గండిపేట్, సెప్టెంబర్ 17 లోకల్ గైడ్: నార్సింగి సర్కిల్ పరిధిలోని కోకాపేట్ ఐసీసీ బ్యాంకు వెనుక గాయత్రి ఎన్క్లేవ్, సుమ్మి రెసిడెన్సి ప్రాంతంలో బాలగణపతి యూత్
అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తెలంగాణ… రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కిలారి సుశీలకు నివాళి
చిరుమర్రి చెరువు వద్ద రూ. 2.90 కోట్లతో పర్యాటక వసతుల అభివృద్ధి
సెప్టెంబర్‌ 17.. పోరాట చరిత్రకు మైలురాయి
ప్రభుత్వ, వైద్య కళాశాల సీట్లు సాధించిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం
దేశభక్తి, ఐక్యత సోదర భావంతో ముందుకు సాగాలి