- District News
- Khammam
- కిలారి సుశీలకు నివాళి
కిలారి సుశీలకు నివాళి
కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 17 (లోకల్ గైడ్ న్యూస్) : సింగరేణి మండలం మాదారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు కిలారి అప్పారావు మాతృమూర్తి కిలారి సుశీల వృద్ధాప్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూరి రాంబాబు, మాదారం సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ తదితరులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ మండల కమిటీ తరఫున సుశీల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కిలారి సుశీల మృతివార్త తెలుసుకున్న తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, ఎంపీ కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరి దయాకర్ రెడ్డి తదితరులు కిలారి వెంకటేశ్వర్లు, కిలారి అప్పారావు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లాలూమంగా, పంచాయతీ కార్యదర్శి విజయ్, మాజీ సర్పంచ్ అజ్మీర నరేష్, జిల్లా నాయకులు గుగులోత్ భీముడు నాయక్, గుడిపూడి తిరుమల రావు, కడియాల సుధాకర్, మండల కాంగ్రెస్ నాయకురాలు కిలారి లక్ష్మి, వార్డు సభ్యులు, వంకుడోత్ వీరన్న,కాంగ్రెస్ నాయకులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
