- District News
- Ranga Reddy
- శంషాబాద్ లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు.
శంషాబాద్ లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు.
పలు పాఠశాలలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు.
శంషాబాద్ జోన్ పరిధిలోని వివిధ పాఠశాలల్లో శుక్రవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు పలు పాఠశాలల్లో శ్రీ కృష్ణుడు, సత్యభామ వేశాలు వేయించి సాంస్కృతిక
కార్యక్రమాలను నిర్వహించారు. కుండలో వెన్న తయారు చేయడం ఆ కుండలో ఉన్న వెన్నను చిన్నారి కృష్ణుడు దొంగిలించి తినడం. అది చూసి అతని తల్లి పట్టుకొని మందలించడం లాంటి ప్రదర్శణలు ఆకట్టుకున్నాయి. చాలమంది చిన్నారి విద్యార్థులు శ్రీకృష్ణుడు - సత్యభామ వేశాల్లో పాఠశాలలకు వెల్లిరావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేవాలయంలో ఉత్సవాలు : శ్రీకృష్ణజన్మాష్టమి పండుగ సందర్భంగా శంషాబాద్ జోన్ పరిధిలోని బ్రహ్మణవాడలో గల శ్రీకృష్ణమందిర్ దేవేలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారు జామునుంచే ప్రత్యేకపూజలు జరిగాయి. శ్రీకృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా డోలాహరణ పూజ జరుగుంతుందని దేవాలయ పూజారీ తెలిపారు. ఈ పండుగ సందర్భంగా ఆయా మహిలందరూ తమ తమ ఇండ్ల ముందు భగవంతుడు శ్రీకృష్ణుడు మా ఇంటిలోకి రావాలని పూజలు నిర్వహించి దేవుడు తన చిన్నారిపాదలతో తమ ఇంట్లోకి నడుచుకుంటూ వస్తాడనే నమ్మకంతో సున్నం ముగ్గులు వేసి ఆ ముగ్గు మధ్యలో చిన్ని కృష్ణుడి పాదాలు వేశారు. ఈ ముగ్గులు పలు ఇండ్ల ముందు కనిపించడంతో పండుగ వాతావరణం కనిపించింది.
,
:
