- District News
- Ranga Reddy
- బియ్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథుడి ప్రతిష్ట
బియ్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథుడి ప్రతిష్ట
గండిపేట్, సెప్టెంబర్ 17 లోకల్ గైడ్:
నార్సింగి సర్కిల్ పరిధిలోని కోకాపేట్ ఐసీసీ బ్యాంకు వెనుక గాయత్రి ఎన్క్లేవ్, సుమ్మి రెసిడెన్సి ప్రాంతంలో బాలగణపతి యూత్ ఆధ్వర్యంలో వినోద్ రీతిలో వినాయకుడిని ఏర్పాటు చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా రకరకాలుగా వినాయకుని రూపంతో ఉన్న విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తారు, కానీ ఇక్కడ వినూత్న రీతిలో బియ్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథుడి ప్రతిమను రూపొందించి భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించారు. బియ్యంతో రూపొందించిన గణనాథుని ప్రత్యేక ఆకర్షణంగా నిలవడంతో స్థానికంగా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. సాయంత్రం వేళల్లో పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివ చ్చి ప్రత్యేక గణపతిని దర్శించుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు. రామచంద్ర, వీరబాబు, దుర్గా ప్రసాద్, సురేష్, ఆనందు, మణికంఠ, వెంకటలక్ష్మి, శిరీష, చంద్రశేఖర్ గౌడ్, రవి తదితరుల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక గణపతికి పూజలు చేశారు
