ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఆచార్య కొత్తపల్లి

జయశంకర్ సార్ జయంతి వేడుక

Published On
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఆచార్య కొత్తపల్లి

 

 ములుగు జిల్లా ఏటూరునాగారం (లోకల్ గైడ్ )

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏటూరు నాగారం లో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో జయశంకర్ సార్ జయంతి వేడుక నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్, బి. రేణుక అధ్యక్షత వహించి, మాట్లాడుతూ జయశంకర్ సార్ తెలంగాణ అస్తిత్వం కోసం చేసిన కృషిని ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించారు. అనంతరం చరిత్ర విభాగ అధిపతి వెంకటయ్య  మాట్లాడుతూ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమ ప్రస్తానాన్ని 1969 నుంచి 2011 వరకు జయశంకర్ సార్ తుది శ్వాస విడిచే వరకు చేసిన ఉద్యమ కృషిని విద్యార్థులకు వివరించారు. జయశంకర్ సార్ రచన వోడవని ముచ్చట అనే రచన యొక్క ప్రాధాన్యతను మరియు దానిలో పేర్కొన్న ప్రముఖ అంశాలను ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించారు .అనంతరం నందిని సిద్ధారెడ్డి తెలంగాణ అమరులపై రాసిన పాట లోని రెండు చరణాలు వినిపించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు  డాక్టర్,డి. నవీన్, డాక్టర్, పి.జ్యోతి, కనీస్ ఫాతిమా, సంపత్, జీవవేణి, రమేశ్, శ్రీధర్, రాజశేఖర్ ,భావన, భారతి, భాస్కర్, శ్రీకాంత్ మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News