- District News
- Ranga Reddy
- టి న్యూస్ ఛానల్ రిపోర్టర్ పై దాడికి పాల్పడిన నిందితులపై
టి న్యూస్ ఛానల్ రిపోర్టర్ పై దాడికి పాల్పడిన నిందితులపై
కఠిన చర్యలు తీసుకోవాలి -జర్నలిస్ట్ సంఘాల నేతల డిమాండ్.
శంషాబాద్ ఆగస్టు 6, ( లోకల్ గైడ్ ): శంషాబాద్ లో జరిగిన ఘర్షణను వీడియో తీస్తున్న టీ న్యూస్ రిపోర్టర్ మసూద్ అలీ ఖాన్ పై దాడికి పాల్పడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం జర్నలిస్టు సంఘాల నేతలు పి. వెంకటేష్, అంజిలప్ప, డి.కృష్ణ గౌడ్, టి. వెంకటయ్య, దేవేందర్, సుదర్శన్ గౌడ్ , గోపాల్, కోరారు. నర్కూడ రోడ్డులో ఈనెల 5 తేదీన రెండు గ్రూప్ ల మద్య గోడవ కవర్ చేసేందుకు వెళ్లిన క్రమంలో కొందరు వ్యక్తులు టి న్యూస్ రిపోర్టర్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచడం సరైంది కాదన్నారు. ఇరువురి ఘర్షణలో రిపోర్టపై విచక్షణ రైతంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ విషయంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులపై చర్యలు తిసుకోకుంటే జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు కూడా వెనుకాడభోమన్నారు. రిపోర్టర్ పై దాడులకు పాల్పడిన అంశం పై ప్రత్యేకంగా అన్ని కోణాల్లో పరిశీలించి నిందితులపై చట్ట పరమైన చర్యలు తీసుకొంటామని ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలస్ట్ లు విక్రమ్, చంద్ర కుమార్, సంజయ్, ,శ్రీనివాస్ ,అంజిలప్ప , వెంకటేష్ హేమంత్ గౌడ్, దేవేందర్,గోపాల్, యాదయ్య మాధవ, చారి ,శ్రీను ,శ్రీకాంత్ గౌడ్,ప్రవీణ్, ముస్తఫా అలీ తోపాటు బాధితుడు మసూద్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు
