- District News
- వాజేడు అధికారుల తో సమీక్షా సమావేశం నిర్వహించిన - ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.
వాజేడు అధికారుల తో సమీక్షా సమావేశం నిర్వహించిన - ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.
ములుగు జిల్లా వాజేడు మండల స్థాయి సమీక్షా సమావేశంలో భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్లు, మిషన్ భగీరథ, అంగన్వాడీ, వ్యవసాయం, అటవీ శాఖ, గ్రామపంచాయతీ అభివృద్ధి, ఆసుపత్రులలో వైద్యం, పశువుల వైద్యం, ఇంకుడు గుంతలు, రోడ్లు తదితర అంశాలపై అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. త్వరలో కొత్తగా నూతనంగా పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాము అని అన్నారు.మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేలా పనులు వేగవంతం చేయాలి అని ఆదేశించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జలసిరి పథకంలో భాగంగా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా నిర్మించుకోవాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.అందరూ అధికారులు అన్నదమ్ముల లాగా సమన్వయంతో పని చేయాలి. ప్రజలకు సేవ చేయడమే మన లక్ష్యం అని ఎమ్మెల్యే అధికారులకు పిలుపునిచ్చారు. గ్రామాలలో విలేజ్ ప్రొఫైల్ ను పంచాయతీ కార్యదర్శులు వెంటనే తయారు చేసి ఎంపీడీఓ కు అందజేయాలని ఆదేశించారు.ఈ మండల స్థాయి సమీక్షా సమావేశంలో డిఆర్డిఏ పీడీ ,డిసిఓ రామ్ మోహన్ రావు , మండల స్థాయి అధికారులు, ఎంపీడీఓ కొండా కృపాకర్ , ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.
