- District News
- Khammam
- మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
మధిర, సెప్టెంబర్ 5 లోకల్ గైడ్:
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను విద్యార్థులు, అధ్యాపకులు ఘనంగా నిర్వహించారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవరచుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
విద్యార్థులు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపాధ్యాయుల పట్ల తమ గౌరవాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏం ఎస్ ఎస్ పి ఓ తార్యU కృష్ణ,P కమల, భాగ్యలక్ష్మి, అరుణ, ప్రగతి, సుధారాణి,G కృష్ణ,T దేవదాస్,T నాగరాజు,B ఉపేందర్,M లాలయ్య, K కొండలరావు కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
