గడప గడపకు సంక్షేమ ఫలాలు… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

216 మంది లబ్ధిదారులకు రూ. 1,02,51,000 విలువ గల సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన మంత్రి

Published On
గడప గడపకు సంక్షేమ ఫలాలు… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

 

 

ఖమ్మం, అక్టోబర్ -4: లోకల్ గైడ్:

గడప గడపకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంIMG-20261004-WA0042త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక శ్రీ శ్రీ సర్కిల్ వద్ద గల తన నివాసంలో ఖమ్మం రూరల్, ఎదులాపురం మునిసిపాలిటీ పరిధిలోని 216 మంది లబ్ధిదారులకు ఒక కోటి 2 లక్షల 51 వేల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో ఖమ్మం రూరల్ మండలానికి చెందిన 51 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 70 మంది, ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని 95 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, పేదల కన్నీళ్లు తుడవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నిరుపేదలకు వైద్య ఖర్చుల భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధిని వేగంగా అందిస్తున్నామన్నారు. అలాగే ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి పథకం ఎంతో ఆసరాగా నిలుస్తోందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టామన్నారు. 

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కారేపల్లి బీసీ కాలనీలో దుర్గమ్మ వైభవం.. భక్తులకు అమ్మవారి దివ్య దర్శనం! కారేపల్లి బీసీ కాలనీలో దుర్గమ్మ వైభవం.. భక్తులకు అమ్మవారి దివ్య దర్శనం!
                కారేపల్లి, అక్టోబర్ 15 (లోకల్ గైడ్ న్యూస్): కారేపల్లి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన
కాంగ్రెస్‌కు దోచుకోవడమే తెలుసు.. పాలన చేతకాదు!.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని జరపకపోవడం విచారకరం!
వికారాబాద్‌లో ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుకై కలెక్టర్‌కు వినతిపత్రం:
ధాన్యం కొనుగోలుపై కేంద్రాల ఇన్చార్జులకు శిక్షణ
ప్రజల భద్రతకు పోలీసులతో కలిసి పనిచేయాలి
నర్సంపేటలో గోల్డ్ కంపెనీ సేల్స్‌మెన్‌కు షాక్.. రూ.5.50 లక్షలు ఎగవేత!