- District News
- Khammam
- కారేపల్లిలో ఘనంగా మనీషా లక్ష్మి జన్మదిన వేడుకలు
కారేపల్లిలో ఘనంగా మనీషా లక్ష్మి జన్మదిన వేడుకలు
బీఆర్‌ఎస్ శ్రేణుల సందడి.. ముఖ్యఅతిథిగా మాజీ జెడ్పీటీసీ వాంకుడోత్ జగన్ నాయక్
కారేపల్లి, అక్టోబర్ 2 (లోకల్ గైడ్ న్యూస్ ) :
బీఆర్‌ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు మనీషా లక్ష్మి జన్మదిన వేడుకలు కారేపల్లిలో ఘనంగా జరిగాయి. బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు డొంకెన రవీందర్ నాయకత్వంలో నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ జెడ్పీటీసీ వాంకుడోత్ జగన్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై మనీషా లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మనీషా లక్ష్మి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మనీషా లక్ష్మి ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆమెకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అజ్మీర రవి, తాత వెంకన్న, మాజీ దిశా కమిటీ సభ్యుడు లకావత్ లక్ష్మణ్, సోమందల నాగరాజు, జరపల అచ్చు, బానోత్ మోహన్, తెలగర్ల రామారావు, జడల కళ్యాణ్, జుంకీలాల్, పాలిక వీరస్వామి, బర్మావత్ కోటి, మూతి కోటేశ్వరరావు, పిల్లలమర్రి వెంకటేష్, భగవాన్ లాల్, హరీష్, మునేందర్, రాజు, ఉపేందర్, వినోద్, మధు, శ్రీకాంత్, ప్రసాద్, రమేష్, సత్యనారాయణ, పూర్ణ, ఎస్. రవీందర్ రెడ్డి, శివరాత్రి బాబు, పొడుగు హరీష్, రాజేష్, గంగారబోయిన మురళి, తొగర రమేష్, పొక్కిలి యుగేందర్, పోతు రాములు, వినీత్, ఉపేందర్, మదన్ లాల్ తదితరులు పాల్గొన్నారు.
