ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందిస్తాం: సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్

Published On
ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

 

మోమిన్‌పేట్, సెప్టెంబర్ 01 ( లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో :

మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో అర్హులైన పేదలందరికీ త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని, కార్డులు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గ్రామ సర్పంచ్ పటేల్ గారి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలువురు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ... అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనేదే తమ ప్రధాన ధ్యేయమన్నారు. సాంకేతికంగా నేడు పంపిణీ ప్రక్రియను ప్రారంభించామని, విడతల వారీగా గ్రామంలోని లబ్ధిదారులందరికీ త్వరలోనే కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. అర్హత ఉండి కార్డులు రాని వారు ధైర్యంగా ఉండాలని, ప్రణాళికాబద్ధంగా ప్రతి ఒక్కరికీ పంపిణీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరసింహులు, జిపిఓ మహేష్ గౌడ్ రేషన్ డీలర్లు మ్యాతరి  రాములు, ఔసలి నాగరాజు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది మరియు కార్ బార్ నాగరాజ్,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
    మోమిన్‌పేట్, సెప్టెంబర్ 01 ( లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో : మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో అర్హులైన పేదలందరికీ త్వరలోనే స్మార్ట్ రేషన్
ఫోన్ మోజులో వైద్యుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసిపాపల ప్రాణాలతో చెలగాటం
ఆమనగల్లు అభివృద్ధి కోసం ఆచారి ఆమరణ నిరాహార దీక్ష
విద్యార్థులకు సరిపడా బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు
ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో కమిషనర్‌ పరిశీలన ఏబీసీ, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలపై సమీక్ష
దళితుల,అభ్యున్నతి,సామాజిక రాజకీయ ,చైతన్యం కాంగ్రెస్ తోనే సాధ్యం.... షాద్ నగర్ నియోజక వర్గంలో ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన