బార్, రెస్టారెంట్ లైసెన్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Published On
బార్, రెస్టారెంట్ లైసెన్సులకు దరఖాస్తుల ఆహ్వానం

నర్సంపేట, లోకల్ గైడ్, సెప్టెంబర్ 29:

నర్సంపేట మున్సిపల్ పరిధిలో నూతన రిటైల్ రెస్టారెంట్, బార్ (ఫారం-2బీ) లైసెన్సుల జారీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ జయశ్రీ తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
అర్హత కలిగిన వ్యక్తులు లేదా సంస్థలు రూ.లక్ష డీడీ లేదా చలానా చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 12 వరకు పనిదినాల్లో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల మధ్య వరంగల్ లోని ప్రావిన్షియల్ ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
స్వీకరించిన దరఖాస్తులకు అక్టోబర్ 16న పారదర్శకంగా లాటరీ డ్రా నిర్వహించి లైసెన్సులు కేటాయిస్తామని తెలిపారు. అర్హులైన వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఐ జయశ్రీ కోరారు.

Tags:

About The Author

Latest News