ఎస్.ఐ.ఆర్ నోటీసులకు ఆన్లైన్ ద్వారా ధృవీకరణ పత్రాలు అందించవచ్చు

కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి

Published On
ఎస్.ఐ.ఆర్ నోటీసులకు ఆన్లైన్ ద్వారా ధృవీకరణ పత్రాలు అందించవచ్చు

IMG-20261001-WA0160

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి లోకల్ గైడ్, అక్టోబర్ 01 :

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగతంగా బీ.ఎల్.ఓలను నేరుగా కలువకుండా, ఆన్లైన్ లో ఈ-మెయిల్, వాట్సప్ ల ద్వారా కూడా సంబంధిత ధృవీకరణ పత్రాలను పంపవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పురోగతి గురించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. మ్యాపింగ్ జరగని వారికి, పేరు, ఇతర వివరాలలో వ్యత్యాసం కలిగి ఉన్న వారికి ఎస్ఐఆర్ లో భాగంగా జారీ చేసిన నోటీసులకు సంబంధించి విచారణ పక్కాగా జరపాలన్నారు. అనర్హులుగా ఉన్నట్లు నిర్ధారణ అయితే, అలాంటి వారికి స్పీకింగ్ ఆర్డర్స్ ద్వారా తెలియజేయాలని అన్నారు. ఇంకనూ ఎవరికైనా నోటీసులు జారీ కాకపోతే వెంటనే నోటీసులు అందజేయాలన్నారు. ఎస్.ఐ.ఆర్ పురోగతి గురించి ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలకు సమాచారం అందించాలని సూచించారు. 
        సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, జిల్లాలో ఇంకనూ 6106 మందికి నోటీసులు అందించాల్సి ఉందన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో 3865 నోటీసులు పెండింగ్ లో ఉన్నాయని, ఆర్మూర్ లో 1631, బోధన్ లో 16, బాన్సువాడ సెగ్మెంట్ లో 437, బాల్కొండ నియోజకవర్గంలో 157 నోటీసులు ఇంకనూ అందించాల్సి ఉందని తెలిపారు. వీరిలో అత్యధిక మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం, ఓటరు జాబితాలో పొందుపరచిన చిరునామాలలో ఉండకపోవడం వంటి కారణాల వల్ల నోటీసులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. బీ.ఎల్.ఓలను క్షేత్రస్థాయిలో వారి ఇళ్ళకు పదేపదే పంపిస్తూ నోటీసులు అందించే ప్రయత్నం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ పురోగతి గురించి ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలకు సమాచారం తెలియజేస్తున్నామని, ఈ.ఆర్.ఓ, ఏ.ఈ.ఆర్.ఓల కార్యాలయాల నోటీసు బోర్డులలో కూడా సమాచారాన్ని ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కాగా, ఇప్పటికే నోటీసులు అందుకున్న ఓటర్లు బీ.ఎల్.ఓలను నేరుగా కలిసే అవకాశం లేనట్లైతే ఆన్లైన్ ద్వారా వాట్సప్, ఈ-మెయిల్ ద్వారా సంప్రదించి ధృవీకరణ పత్రాలు పంపవచ్చని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తు.చ తప్పక పాటించాలని, హియరింగ్ ను పారదర్శకంగా నిర్వహిస్తూ, నిర్ణీత గడువు లోపు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ.ఆర్.ఓలను ఆదేశించారు. 
    వీడియో కాన్ఫరెన్స్ లో  అదనపు కలెక్టర్ భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గోవిందుతండాలో వైభవంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ గోవిందుతండాలో వైభవంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ
        కారేపల్లి, అక్టోబర్ 11 (లోకల్ గైడ్ న్యూస్): దసరా పండుగను పురస్కరించుకుని శరన్నవరాత్రుల సందర్భంగా కారేపల్లి మండలం గోవిందుతండా గ్రామంలో శ్రీ బాల త్రిపుర సుందరి
ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడి, పాడిన మంత్రి సీతక్క
ఎంప్లాయిస్ యూనియన్ కూటమిని గెలిపించిన ఆర్టీసీ కార్మికులకు అభినందనలు
అమెరికాసామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి.
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ' కూటమి ఘన విజయం
సి సి రోడ్డు శంకుస్థాపన చేసిన సర్పంచ్ ఖమ్మంపాటి స్వాతి జగన్  
సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి.