సహజ వ్యవసాయంతో రైతులకు మేలు . జ్యోతి రెడ్డి .

జ్యోతి రెడ్డిఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమము.

Published On
సహజ వ్యవసాయంతో రైతులకు మేలు .  జ్యోతి రెడ్డి .

 




నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.


రైతులు రసాయన ఎరువులు, పురుగు మందులపై అధికంగా ఆధారపడకుండా సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులు సాధించేలా ప్రోత్స హించేందుకు జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నార్కట్పల్లిలో సహజ వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. జ్యోతి రెడ్డి దుడ్లిపాల,  కర్నాటి వెంకన్న, ఏవో. గౌతమ్, ఏ ఈ ఓ శిరీష, తదితరులు పాల్గొని రైతులకు సహజ వ్యవసాయం ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భం గా రైతులకు సహజ వ్యవసాయం, నేల ఆరోగ్యం, సేంద్రియ ఎరువుల వినియోగం, దేశీ ఆవు ఆధారిత వ్యవసాయ పద్ధతులు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు రసాయన ఆధారిత వ్యవసాయంతో పెరుగుతున్న సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, నేల సహజ సారాన్ని కాపాడుకోవడానికి సహజ వ్యవసాయ పద్ధతులు ఉపయోగపడతాయని నిర్వాహకులు వివరించారు. జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు సేంద్రియ ఎరువును పంపిణీ చేశారు. రైతులు తమ పొలాల్లో సహజ వ్యవసాయ పద్ధతులను దశలవారీగా ఆచరణలోకి తీసుకు రావాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల్లో సహజ వ్యవసాయంపై అవగాహన పెంచడంతో పాటు, ఆరోగ్యకరమైన నేల ఆరోగ్యకరమైన పంట ఆరోగ్యకరమైన సమాజంఅనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు. నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో  
, రైతులు  స్థానిక ప్రజలు ప్రజా ప్రతినిధులు   పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పోషకాహారంతో పసిబిడ్డలకు బలం పోషకాహారంతో పసిబిడ్డలకు బలం
        కారేపల్లి, అక్టోబర్ 3 (లోకల్ గైడ్ న్యూస్ ) : జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో శనివారం అవగాహన కార్యక్రమం
నిర్లక్ష్యానికి ఐదుగురు  బలి.. ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి!
అక్టోబర్ 6న ఉస్మానియా కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
దివ్యాంగులు, వయోవృద్ధులు, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా
వికారాబాద్ బస్సు ప్రమాద బాధితులకు అండగా డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి
ఒంటరి వికలాంగ మహిళకు ‘మీకోసం మేమున్నాం’ అండ
అక్టోబర్ 6న 'మాదిగ విద్యార్థుల ప్రతినిధుల సదస్సు' విజయవంతం చేద్దాం