వికారాబాద్ బస్సు ప్రమాద బాధితులకు అండగా డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి

ప్రభుత్వ వైద్యశాలలో క్షతగాత్రులకు పరామర్శ కేఆర్ఆర్ సిబ్బంది

అత్యవసర వైద్య సేవలు.  బిజెపి రాష్ట్ర వైద్య విభాగ కన్వీనర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి 
Published On
వికారాబాద్ బస్సు ప్రమాద బాధితులకు అండగా డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి

 

 లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో :

 వికారాబాద్ అనంతగిరి  ఘోర బస్సు ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో గాయపడి, స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వైద్య విభాగ కన్వీనర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి శనివారం పరామర్శించారు.
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన ఆయన, తన కేఆర్ఆర్ ఆసుపత్రి ప్రత్యేక వైద్య బృందం మరియు సిబ్బందితో కలిసి ఘటనా స్థలంలోనూ, వైద్యశాలలోనూ క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందించారు. వైద్యుడిగా తన అనుభవంతో బాధితులకు త్వరితగతిన ప్రాథమిక చికిత్స అందేలా చొరవ చూపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి అందుతున్న వైద్య సేవలపై ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
బాధిత కుటుంబాలకు అన్నివేళలా అండగా ఉంటామని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి భరోసానిచ్చారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం ప్రకటించాలని, వారి పూర్తి వైద్య ఖర్చులను భరించి ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags:

About The Author

Latest News

పోషకాహారంతో పసిబిడ్డలకు బలం పోషకాహారంతో పసిబిడ్డలకు బలం
        కారేపల్లి, అక్టోబర్ 3 (లోకల్ గైడ్ న్యూస్ ) : జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో శనివారం అవగాహన కార్యక్రమం
నిర్లక్ష్యానికి ఐదుగురు  బలి.. ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి!
అక్టోబర్ 6న ఉస్మానియా కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
దివ్యాంగులు, వయోవృద్ధులు, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా
వికారాబాద్ బస్సు ప్రమాద బాధితులకు అండగా డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి
ఒంటరి వికలాంగ మహిళకు ‘మీకోసం మేమున్నాం’ అండ
అక్టోబర్ 6న 'మాదిగ విద్యార్థుల ప్రతినిధుల సదస్సు' విజయవంతం చేద్దాం