అక్టోబర్ 6న ఉస్మానియా కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

పి. ఆనంద్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు 

Published On
అక్టోబర్ 6న ఉస్మానియా కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

 

లోకల్ గైడ్,  వికారాబాద్ జిల్లా బ్యూరో 

 ఈ నెల 6న హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాల ప్రాంగణంలో జరగబోయే మాదిగ విద్యార్థి సమాఖ్య ( ఎమ్మెస్ ఎఫ్ ) జాతీయ మహాసభలను విద్యార్థులందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని మహాజన సోషలిస్ట్ పార్టీ ( ఎం ఎస్ పి ) జిల్లా మాజీ అధ్యక్షుడు పి. ఆనంద్ మాదిగ పిలుపునిచ్చారు.
శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక గ్రంథాలయ ప్రాంగణంలో మాదిగ మహిళలు, విద్యార్థులు, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాదిగ మాట్లాడుతూ... వివిధ గ్రామాలు, మండలాలు, కళాశాలలు మరియు సంక్షేమ వసతిగృహాలలోని ఎంఎస్ఎఫ్ కమిటీల ప్రతినిధులు, మాదిగ విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నపూర్ణ మాదిగ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కేశపల్లి సునీత, రాములు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సుభాష్ మాదిగ, దారూర్ మండల అధ్యక్షుడు పి.నందు మాదిగ, పద్మమ్మ, లక్ష్మి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పోషకాహారంతో పసిబిడ్డలకు బలం పోషకాహారంతో పసిబిడ్డలకు బలం
        కారేపల్లి, అక్టోబర్ 3 (లోకల్ గైడ్ న్యూస్ ) : జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో శనివారం అవగాహన కార్యక్రమం
నిర్లక్ష్యానికి ఐదుగురు  బలి.. ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి!
అక్టోబర్ 6న ఉస్మానియా కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
దివ్యాంగులు, వయోవృద్ధులు, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా
వికారాబాద్ బస్సు ప్రమాద బాధితులకు అండగా డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి
ఒంటరి వికలాంగ మహిళకు ‘మీకోసం మేమున్నాం’ అండ
అక్టోబర్ 6న 'మాదిగ విద్యార్థుల ప్రతినిధుల సదస్సు' విజయవంతం చేద్దాం