పోషకాహారంతో పసిబిడ్డలకు బలం

సమతుల్య ఆహారంతో ఆరోగ్యకర సమాజానికి పునాది: సీడీపీవో కే. ఉమ

Published On
పోషకాహారంతో పసిబిడ్డలకు బలం

 

 

కారేపల్లి, అక్టోబర్ 3 (లోకల్ గైడ్ న్యూస్ ) :

జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ కామేపల్లి ప్రాజెక్టు సీడీపీవో కే. ఉమ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలు పౌష్టికాహారం అందించడంతో పాటు చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలు అందిస్తూ బహుళార్ధక కేంద్రాలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కే. ఉమ సూచించారు. చిరుధాన్యాలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని తెలిపారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సీడీపీవో కే. ఉమ కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ సత్యశీల, పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, జీ పీ వో సుమతి, వార్డు సభ్యుడు వాంకుడోత్ గాంధీ, అంగన్‌వాడీ టీచర్స్ ప్రేమలత, సరిత, సుజాత, పద్మ, సరోజ, హైమావతి, కౌసల్య, గ్రామస్తులు సుమ, రాంబాబు, రాందాస్, హేంచంద్,పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పోషకాహారంతో పసిబిడ్డలకు బలం పోషకాహారంతో పసిబిడ్డలకు బలం
        కారేపల్లి, అక్టోబర్ 3 (లోకల్ గైడ్ న్యూస్ ) : జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో శనివారం అవగాహన కార్యక్రమం
నిర్లక్ష్యానికి ఐదుగురు  బలి.. ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి!
అక్టోబర్ 6న ఉస్మానియా కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
దివ్యాంగులు, వయోవృద్ధులు, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా
వికారాబాద్ బస్సు ప్రమాద బాధితులకు అండగా డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి
ఒంటరి వికలాంగ మహిళకు ‘మీకోసం మేమున్నాం’ అండ
అక్టోబర్ 6న 'మాదిగ విద్యార్థుల ప్రతినిధుల సదస్సు' విజయవంతం చేద్దాం