నల్లగొండ కార్పోరేషన్ లో అన్ని సౌకర్యాలు కల్పించి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే కాక బెస్ట్ కార్పొరేషన్ అవార్డు అందుకుంటాం.

రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి .

Published On
నల్లగొండ కార్పోరేషన్ లో అన్ని సౌకర్యాలు కల్పించి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే కాక బెస్ట్ కార్పొరేషన్ అవార్డు అందుకుంటాం.

 

 

 

IMG-20260922-WA0137

 నల్గొండ కార్పొరేషన్ లో అన్ని సౌకర్యాలు కల్పించి స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దడమే కాక 
 బెస్ట్ కార్పోరేషన్ అవార్డు కూడా అందుకుంటామని రాష్ట్ర రోడ్లు,భవనాలు ,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం ఇందిరాభవన్ వద్ద నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో పరిశుభ్రతకు   సంబంధించి కోటి 1  లక్ష రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన రెండు వెట్టింగ్ మెషిన్లను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇటీవల నల్గొండ కార్పొరేషన్  స్వచ్ఛ అవార్డు అందుకుందని,
నూతనంగా ఏర్పాటైన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రజలకు అన్ని రకాల సేవలు అందించేందుకు కృషి చేయడం జరుగుతున్నదని, ముఖ్యంగా 24 గంటలు తాగునీరు అందించేందుకు 83 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పిలవడం జరిగిందన్నారు. నల్గొండ కార్పొరేషన్లో ఎస్ డి ఎఫ్ నిధులతో 63 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశామని, అలాగే తక్కిన  డివిజన్లలో కూడా రోడ్లతో పాటు, డ్రైన్లు నిర్మిస్తామని, 6 నెలల్లో ఎస్టిపి పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.  నల్గొండ కార్పొరేషన్ కు అన్ని రకాల నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేసి ఉత్తమ కార్పోరేషన్ అవార్డు కూడా తీసుకుంటామనే నమ్మకం తనకున్నట్టు మంత్రి తెలిపారు. నల్గొండ కార్పొరేషన్ పరిధిలో 900 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టామని, అలాగే డ్రైనేజీ ,ఎస్ టి పి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ,ఆర్ అండ్ బి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Tags:

About The Author

Latest News

పోషకాహారంతో పసిబిడ్డలకు బలం పోషకాహారంతో పసిబిడ్డలకు బలం
        కారేపల్లి, అక్టోబర్ 3 (లోకల్ గైడ్ న్యూస్ ) : జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో శనివారం అవగాహన కార్యక్రమం
నిర్లక్ష్యానికి ఐదుగురు  బలి.. ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి!
అక్టోబర్ 6న ఉస్మానియా కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
దివ్యాంగులు, వయోవృద్ధులు, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా
వికారాబాద్ బస్సు ప్రమాద బాధితులకు అండగా డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి
ఒంటరి వికలాంగ మహిళకు ‘మీకోసం మేమున్నాం’ అండ
అక్టోబర్ 6న 'మాదిగ విద్యార్థుల ప్రతినిధుల సదస్సు' విజయవంతం చేద్దాం