నిర్లక్ష్యానికి ఐదుగురు  బలి.. ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి!

బస్సు ప్రమాదంలో బాధితులకు ₹50 లక్షల పరిహారం చెల్లించాలి: 

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్
Published On
నిర్లక్ష్యానికి ఐదుగురు  బలి.. ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి!

IMG-20261003-WA0245

 లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో :

వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాద స్థలాన్ని బిఆర్ఎస్ పార్టీ  స్థానిక మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పరిశీలించారు. మానవత్వం చాటుకున్న డాక్టర్ హోదాలో ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో బస్సు బోల్తా పడిందని సమాచారంతో పరుగు పరుగున వచ్చి వైద్యం అందించారు.అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
ఈ దుర్ఘటనలో ఐదుగురు  ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందని డాక్టర్ మెతుకు ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
 బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.......
మృతుల కుటుంబాలకు ₹50 లక్షల ಪರಿహారం: ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ₹25 లక్షలు, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం తరఫున ₹25 లక్షలు కలిపి మొత్తం ₹50 లక్షల పరిహారం వెంటనే అందజేయాలి.
బాధితులకు ₹10 లక్షల సాయం: కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు ₹10 లక్షల పరిహారం ప్రకటించాలి.
ఉచిత వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలి.
వాహనాల ఫిట్‌నెస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల ఫిట్‌నెస్‌పై యాజమాన్యాలు, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు.
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఆర్టిఏ  అధికారులు ప్రైవేట్ వాహనాలను ఎప్పటికప్పుడు కఠినంగా తనిఖీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు.

Tags:

About The Author

Latest News

పోషకాహారంతో పసిబిడ్డలకు బలం పోషకాహారంతో పసిబిడ్డలకు బలం
        కారేపల్లి, అక్టోబర్ 3 (లోకల్ గైడ్ న్యూస్ ) : జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో శనివారం అవగాహన కార్యక్రమం
నిర్లక్ష్యానికి ఐదుగురు  బలి.. ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి!
అక్టోబర్ 6న ఉస్మానియా కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
దివ్యాంగులు, వయోవృద్ధులు, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా
వికారాబాద్ బస్సు ప్రమాద బాధితులకు అండగా డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి
ఒంటరి వికలాంగ మహిళకు ‘మీకోసం మేమున్నాం’ అండ
అక్టోబర్ 6న 'మాదిగ విద్యార్థుల ప్రతినిధుల సదస్సు' విజయవంతం చేద్దాం