బయ్యారం చెరువుకు గోదావరి జలాలను తరలించాలని అసెంబ్లీలో ప్రస్తావించిన.

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Published On
బయ్యారం చెరువుకు గోదావరి జలాలను తరలించాలని అసెంబ్లీలో ప్రస్తావించిన.

లోకల్ గైడ్ సెప్టెంబర్ 20 బయ్యారం:

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి మాట్లాడుతూ బయ్యారం పెద్ద చెరువుకు గోదారి జలాలను అందించడం వల్ల బయ్యారం మండలం సశ్యామలం కానుంది బయ్యారం మండలంలో రెండు పంటలతో పాటు గార్ల ,డోర్నకల్ మండలాలు బీడు భూములు సాగు భూములుగా మారుతాయి దీనితోపాటు బి ఎన్ గుప్తా ప్రాజెక్టు నీ జలాలను తరలించడం వల్ల కుడి కాలువ ద్వారా మహబూబాబాద్ పట్టణం తాగునీరు అందించవచ్చు అదేవిధంగా గూడూరు మండలంలో కూడా అందించవచ్చు పాలకులు అనేక దశాబ్దాలుగా బయ్యారం పెద్ద చెరువును నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారు గతంలో టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు బయ్యారం పెద్ద చెరువును మీడియం ఇరిగేషన్ గా చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు 2016 రోళ్ళపాడు వద్ద గోదారి జలాలను బయ్యారం చెరువుకు తరలిస్తామని శంకుస్థాపన చేశారు కానీ రీడిజన్ పేరుతో అటు రోల్లపాడుకు బయ్యారం పెద్ద చెరువుకు గోదావరి నీళ్లను అందించకపోగా బయ్యారం పెద్ద చెరువు కు గోదారి జలాలను అందించాలని ది 18 9 2026 సిపిఐ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు  బయ్యారం పెద్ద చెరువు కు సిపిఐ పార్టీ జిల్లా పార్టీ కార్యదర్శి విజయ సారధి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టేబోయిన శ్రీనివాస్, బయ్యారం మండల పార్టీ కార్యదర్శి సారిక శ్రీనివాస్ ఆధ్వర్యంలో బయ్యారం పెద్ద చెరువుకు గోదారి జలాలు ఇవ్వాలని మెమోరండం ఇవ్వగా అదే రోజు ఎమ్మెల్యే సాంబశివరావు  అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. గోదావరి జలాలు బయ్యారం పెద్ద చెరువుకు ఇవ్వకపోతే పార్టీ ఆధ్వర్యంలో దశల వారి ఆందోళనలు చేపడుతామని పెద్ద చెరువుకు గోదారి జలలు వచ్చేంతవరకు పోరాటం చేస్తామని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్, మండల కార్యదర్శి సారిక శ్రీనివాస్, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు నాదెండ్ల పద్మ, గిరిజన సమాఖ్య జిల్లా నాయకులు భూక్య హరి నాయక్, మండల సహాయ కార్యదర్శి గంగరబోయిన రాజు, బందెల కళింగ రెడ్డి, రైతు సంగం మండల అధ్యక్షులు మందనపు రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం
లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా బ్యూరో: వికారాబాద్ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై టీఆర్‌ఎస్‌వీ (బిఆర్‌ఎస్‌వీ) జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి...
ప్రార్థించే పెదవుల్లో కన్నా సహాయం చేసే చేతులు మిన్న  - మానవత్వం 
దళిత నాయకుడి ఎదుగుదలను ఓర్వలేకే అక్రమ కేసులు
మహాత్ముడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శం
మహాత్మునికి ఘనమైన నివాళులు
ఘనంగా గాంధీ ,శాస్త్రీ ల జయంతి వేడుకలు
ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.