కనగల్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .

పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, నాణ్యమైన దర్యాప్తు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలి .

 జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.
Published On
కనగల్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .

 

 

IMG-20261027-WA0146IMG-20261027-WA0143IMG-20261027-WA0145


నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.

నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం కనగల్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న జిల్లా ఎస్పీ గారికి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, సిబ్బంది విధుల నిర్వహణ, రికార్డు గదులు, సీసీ కెమెరాల పనితీరు, సిబ్బంది కిట్ తదితర అంశాలను పరిశీలించారు.పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ ట్రయల్ కేసులు, కోర్టు కేసుల వివరాలను సమీక్షించి, కేసుల దర్యాప్తు పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, అవసరమైన సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించాలని, నిర్ణీత సమయంలో చార్జిషీట్లు దాఖలు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని, కేసుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.అలాగే క్రైమ్ రిజిస్టర్, జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్, కేసు డైరీ ఫైల్స్, కోర్టు కేసుల రికార్డులు, స్టేషన్ రికార్డులు, బీట్ బుక్స్ తదితర రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని సూచించారు.ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారి సమస్యలను గౌరవంగా విని, చట్టపరిధిలో తక్షణమే స్పందించాలని జిల్లా ఎస్పీ సిబ్బందికి సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, ప్రతి ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తక్షణ పోలీస్ సేవలు అందించాలని తెలిపారు. ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం, భరోసా పెరిగేలా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.కనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గంజాయి  ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు వివరించాలని తెలిపారు. రౌడీషీటర్లు, పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైన ప్రాంతాల్లో బీట్ పెట్రోలింగ్‌ను పెంచాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేసి నేరాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.మహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళలపై జరిగే నేరాల విషయంలో తక్షణమే స్పందించి బాధితులకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు.అనంతరం పోలీస్ సిబ్బంది సంక్షేమానికి సంబంధించిన అంశాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది విధులు, సెలవులు, వసతులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు తెలుసుకుని, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, పారదర్శకత పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని తెలిపారు.ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ఫిర్యాదుల సత్వర పరిష్కారం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, సూచించారు.ఈ వార్షిక తనిఖీలో జిల్లా ఎస్పీ  వెంట నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,ఎస్బి సీఐ నాగరాజు,చండూర్ సీఐ రాము, డీసీఆర్‌బీ సీఐ శ్రీను నాయక్, ఎస్‌ఐ రాజీవ్ రెడ్డి, సంబంధిత పోలీస్ అధికారులు, కనగల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గుడిపూడి తిరుమల రావు జన్మదిన వేడుకల్లో రామకృష్ణాపురం యూత్ సందడి! గుడిపూడి తిరుమల రావు జన్మదిన వేడుకల్లో రామకృష్ణాపురం యూత్ సందడి!
        కారేపల్లి, అక్టోబర్ 27 (లోకల్ గైడ్ న్యూస్): కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అనుచరుడు, గేట్ కారేపల్లికి చెందిన ఎన్‌ఆర్‌ఐ, గుడిపూడి ఫౌండేషన్
ఘనంగా 'అమ్మ రక్షక పురస్కారం' ప్రదానం.. విశేష సేవలందించిన సిఐ రాజశేఖర్ రెడ్డి కి సత్కారం.
కనగల్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ .
వన్యప్రాణుల వేటకు విద్యుత్ ఉచ్చులు!
ఎన్నికల హామీని నెరవేర్చిన 20 వార్డు కౌన్సిలర్ జైదుపల్లి లక్ష్మి
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహణ .
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఒక దుకాణం సీజ్