- District News
- Khammam
- వన్యప్రాణుల వేటకు విద్యుత్ ఉచ్చులు!
వన్యప్రాణుల వేటకు విద్యుత్ ఉచ్చులు!
పామాయిల్ తోటలో అక్రమ విద్యుత్ తీగలు.. నలుగురిపై అటవీశాఖ కేసు
Published On
By Ram Reddy
కారేపల్లి, (లోకల్ గైడ్ న్యూస్):
వన్యప్రాణులను వేటాడేందుకు పామాయిల్ తోటలో అక్రమంగా విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేసిన నలుగురిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మాదారం పరిసర గ్రామాలకు చెందిన పబ్బుల రాములు, భూక్యా రఘు, రెడ్డిబోయిన వెంకన్న, ఎల్లిబోయిన నాగేశ్వరరావు అప్పాయిగూడెం సమీపంలోని పాలిక కోటయ్యకు చెందిన పామాయిల్ తోటలో వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ తీగలు అమర్చినట్లు అధికారులు గుర్తించారు. విద్యుత్ సరఫరా పదేపదే నిలిచిపోతుండటంతో విద్యుత్ శాఖ సిబ్బంది సహకారంతో అటవీ అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమ ఉచ్చులను గుర్తించారు. విచారణ అనంతరం నలుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎఫ్‌ఆర్‌ఓ ఆర్. శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ ఏ. రవికుమార్, ఎఫ్‌బీఓ బి. రవి తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
28 Oct 2026 14:18:24
క్రీడాకారుల అభివృద్ధే ధ్యేయం...
