- District News
- Khammam
- గుడిపూడి తిరుమల రావు జన్మదిన వేడుకల్లో రామకృష్ణాపురం యూత్ సందడి!
గుడిపూడి తిరుమల రావు జన్మదిన వేడుకల్లో రామకృష్ణాపురం యూత్ సందడి!
గుడిపూడి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎన్‌ఆర్‌ఐ తిరుమల రావుకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన యువత
కారేపల్లి, అక్టోబర్ 27 (లోకల్ గైడ్ న్యూస్):
కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అనుచరుడు, గేట్ కారేపల్లికి చెందిన ఎన్‌ఆర్‌ఐ, గుడిపూడి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గుడిపూడి తిరుమల రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కారేపల్లి మండలం రేగులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రామకృష్ణాపురం యూత్ సభ్యులు వేడుకల్లో పాల్గొని తిరుమల రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యువకులు తిరుమల రావుతో కేక్ కట్ చేయించి, కేక్ తినిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన ఆయురారోగ్యాలతో, మరిన్ని విజయాలు సాధిస్తూ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. యువకుల సందడితో జన్మదిన వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ కార్యక్రమంలో పిట్టల మధు, అడపా వెంకట్, పిట్టల కార్తీక్, రెడ్డబోయిన వెంకటేశ్వర్లు, దాడిదల సంతోష్, అడపా కోటేశ్వరరావు, పిట్టల కళ్యాణ్, వాసు, చింతకాయల కార్తీక్ తదితరులు పాల్గొని తిరుమల రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
