- District News
- ఎన్నికల హామీని నెరవేర్చిన 20 వార్డు కౌన్సిలర్ జైదుపల్లి లక్ష్మి
ఎన్నికల హామీని నెరవేర్చిన 20 వార్డు కౌన్సిలర్ జైదుపల్లి లక్ష్మి
రాజీవ్ గృహకల్పలో ముమ్మరంగా రోడ్డు నిర్మాణ పనులు – స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మున్సిపల్ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని 20వ వార్డు కౌన్సిలర్ జైదుపల్లి లక్ష్మి పేర్కొన్నారు. వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ గృహకల్పలోని మసీదు సమీపంలో నూతన రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ జైదుపల్లి లక్ష్మి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ప్రత్యేక చొరవ, వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య మరియు వైస్ చైర్‌పర్సన్ అర్ధ సుధాకర్ రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
ఎన్నికల ప్రచార సమయంలో ఈ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం కల్పిస్తానని స్థానిక నివాసితులకు హామీ ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం నేడు ఆ సమస్యను పరిష్కరించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. వార్డు సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.
పాటించిన హామీని నెరవేర్చి, తమ ప్రాంతంలో రాజీవ్ గృహకల్ప స్థానిక ప్రజలు కౌన్సిలర్ జైదుపల్లి లక్ష్మి గారికి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మరియు మున్సిపల్ పాలకవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడమే కాకుండా హర్షం వ్యక్తం చేశారు.
