- District News
- ఘనంగా ప్రజా పాలన దినోత్సవం.
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం.
ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకోవాలి.
మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బ్యూలా.
Published On
By Ram Reddy
లోకల్ గైడ్/బంట్వారం:
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బంట్వారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బ్యూలా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బ్యూలా మాట్లాడుతూ... తెలంగాణ సాధన కోసం ఉద్యమకారులు చేసిన పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. వారి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
17 Sep 2026 12:28:16
---------------------------------------పెద్దపల్లి, సెప్టెంబర్-17:(లోకల్ గైడ్ )----------------------------------------సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,...
