ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Published On
ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

IMG-20260916-WA0124ఖమ్మం, సెప్టెంబర్- 16: లోకల్ గైడ్:

త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న  ఈవిఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, రాజకీయ ప్రతినిధులతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. 

ముందుగా ఈవిఎం గోడౌన్ సీల్ ను పరిశీలించి రాజకీయ ప్రతినిధులు, అధికారుల సమక్షంలో సీల్ తీసి లోపలికి వెళ్లి, ఈ.వి.ఎం., వి.వి.ప్యాట్లు ఉన్న గది లోపల పరిశీలన చేసి తిరిగి సీల్ వేయించారు. తనిఖీ రిజిస్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. అలారం, ఫైర్ సేఫ్టీ పరికరాలు పరిశీలించారు. సీసీ కెమెరాల పని తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు. ఎన్నికల సామాగ్రి భద్రత అత్యంత ముఖ్యమని, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు. 

జిల్లా కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ఎం.ఏ. రాజు, ఆర్ అండ్ బి డిఇ లఖన్ నాయక్, ఎన్నికల డిటి అన్సారీ, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి పసుమర్తి శ్రీనివాస్, బహుజన్ సమాజ్ పార్టి ప్రతినిధి వేల్పుల రామయ్య, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బి. వేణుగోపాల్, బిజెపి పార్టీ ప్రతినిధి వి. రాజేష్, సిపిఐ (ఎం) పార్టీ ప్రతినిధి ఆర్. ప్రకాష్, ఐఎన్ సి పార్టీ ప్రతినిధి అన్నెం గోపాల్ రావు, టిడిపి పార్టీ ప్రతినిధి పాలడుగు టిఆర్ కృష్ణప్రసాద్, అధికారులు, తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News

ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.
లోకల్ గైడ్ /తాండూరు:తాండూరు ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (టీపీఆర్ఎస్ఏ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం పట్టణంలోని సాయిమేధా స్కూల్లో ఘనంగా జరిగింది....
రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కల‌కుంట్ల వినోద్ కుమార్ నియామకం .
ఇఫ్తికార్ అహ్మద్‌ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన  దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలి : సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట
శంషాబాద్ సిద్ధేశ్వర్ కాలనీలో విషాదం: మనస్తాపంతో 19 ఏళ్ల యువతి ఆత్మహత్య.
రేబిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్రే బిస్ నివారణకు వ్యాక్సినేషన్‌నే ప్రధాన మార్గం
సమ్మక్క–సారలమ్మ, నాగులమ్మ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలి