- District News
- Nalgonda
- ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇచ్చే అర్హత తనకు లేదు.
ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇచ్చే అర్హత తనకు లేదు.
తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదు.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.
తన పై వచ్చిన ఆరోపణ లు సరి కాదని నిజం లేదని నల్లగొండ డిప్యూటీ తాసిల్దార్ మొగిలి విజయ్‌శేఖర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.తనపై వస్తున్న ఆరోపణలు వాస్తవమైతే దేనికైనా సిద్ధమని డిప్యూటీ తహసీల్దార్ మొగిలి విజయ్‌శేఖర్ స్పష్టం చేశారు.ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేసే అధికారం తనకు లేదని.. సంబంధిత అధికారం ఉన్నతాధికారులకే ఉంటుందని తెలిపారు.
కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలను తనపై రుద్దడం సమంజసం కాదన్నారు .
మార్చి 18న ఎమ్మార్వో కార్యాలయం నుండి ఇరుపక్షాలకు నోటీసులు జారీచేసినట్లు డిప్యూటీ తాసిల్దార్ మొగిలి విజయశేఖర్ తెలిపారు
ఇరు పక్షాలను ఆర్డీవో సమక్షంలో విచారణలకు హాజరుకావాలని ఉన్నతాధికారులు సూచించినట్లు డిప్యూటీ తహసిల్దార్ వెల్లడించారు .ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదా నిలిపివేయడంలో తనకు ఎలాంటి అధికార పరిధి లేదని స్పష్టం చేశారు.తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. తనపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని విజయ్‌శేఖర్ పేర్కొన్నారు.
