- District News
- వీరభద్ర స్వామి, పోచమ్మ తల్లి ఆశీస్సులతో ..!
వీరభద్ర స్వామి, పోచమ్మ తల్లి ఆశీస్సులతో ..!
పల్లెలు పంట పొలాలతో పరవశించాలి.!!
వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్ట్ 21:
వీరభద్ర స్వామి, పోచమ్మ తల్లి చల్లని ఆశీస్సులతో గ్రామాలు పసిడి పంటలతో విరసిల్లాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఖిలఘనపురం మండలం బలిజపల్లి గ్రామంలో
శ్రీ వీరభద్ర స్వామి దేవాలయ ద్వజ స్తంభ ,పోచమ్మ తల్లి నాభి శిలల పునర్ ప్రతిష్ట వేడుకల్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయన సతీమణి వాసంతి లు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. బలిజపల్లి గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠతో పాటు శ్రీ పోచమ్మ అమ్మవారి నాభి శిలల పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో మంత్రి దంపతులు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీశైలం బసవ కళ్యాణ ఆశ్రమ పీఠాధిపతి, మహా తపస్వి పూజ్య శ్రీ షడా బసవలింగ అవధూత స్వామి వారి ఆశీస్సులను మాజీ మంత్రి దంపతులు స్వీకరించారు. స్వామివారితో ఆధ్యాత్మిక విషయాలపై మాట్లాడి వారి ఆశీర్వాదం పొందారు. ఈ పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గ్రామ ప్రజలందరికీ శ్రీ వీరభద్ర స్వామి, శ్రీ పోచమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, గ్రామంలో సుఖశాంతులు, ఆయురా రోగ్యాలు, పాడిపంటలతో సమృద్ధి నెలకొనాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆకాంక్షిం చారు.అలాగే ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలను గ్రామ ప్రజలు ఐకమత్యంతో కొనసాగించడం అభినందనీ యమన్నారు. భక్తుల విశ్వాసం, గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ఆలయాలు మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
