విద్యార్థుల చదువులకు నరసింహారావు–ప్రసన్న లక్ష్మి దంపతుల చేయూత

Published On
విద్యార్థుల చదువులకు నరసింహారావు–ప్రసన్న లక్ష్మి దంపతుల చేయూత

 

చర్ల :  లోకల్ గైడ్ న్యూస్ :
విద్యతోనే ఉజ్వల భవిష్యత్ సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని గాదంశెట్టి ప్రసన్న లక్ష్మి అన్నారు. వస్త్ర వ్యాపారి గాదంశెట్టి నరసింహారావు–ప్రసన్న లక్ష్మి దంపతుల కుమారుడు నరసింహ దేవ జన్మదినాన్ని పురస్కరించుకొని చర్లలోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం, శబరి బాలికా నిలయ విద్యార్థులకు 50 కిలోల బియ్యం, భోజనం, బిస్కెట్లు, పెన్నులు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రసన్న లక్ష్మి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. సంస్థ ద్వారా ఆదివాసీ చిన్నారులకు విద్యను అందించడం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్థులు తమకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి నిలయానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడం లేదని, కేవలం దాతల సహకారంతోనే నిర్వహిస్తున్నామని తెలిపారు. దాతల నుంచి నేరుగా నగదు సేకరించకుండా వస్తు రూపంలోనే సహాయం స్వీకరిస్తున్నామని వివరించారు. గాదంశెట్టి నరసింహారావు–ప్రసన్న లక్ష్మి దంపతులు వివిధ సందర్భాల్లో విద్యార్థుల చదువులకు సహకరిస్తుండటం అభినందనీయమని అన్నారు. పేద ఆదివాసీ విద్యార్థులపై వారు చూపుతున్న ప్రేమాభిమానాలు అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. దాతల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులు మంచిగా విద్యనభ్యసించి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొమరం భీం నిలయ కమిటీ ఉపాధ్యక్షుడు గోగికార్ రాంలక్ష్మణ్, సహ కోశాధికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, గాదంశెట్టి సుధారాణి, నంబూరి అశ్వని, లక్ష్మి నర్సింహ, దివిత, లేక్ష్యశ్రీ, నిలయ ప్రముఖులు వరలక్ష్మి, సంతోష్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులవ్వాలి.... పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)
మహిళా సంఘాలకు అండగా ప్రభుత్వం.. వడ్డీలేని రుణాలు, ఉపాధి అవకాశాలు. సత్తుపల్లిలో ఇందిర మహిళాశక్తి సదస్సు లో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన మంత్రి...
వైరాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
విరాట్ మోటార్స్ నూతన ఓలా షోరూం ఘనంగా ప్రారంభం...
తెలంగాణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి.  
విద్యార్థుల చదువులకు నరసింహారావు–ప్రసన్న లక్ష్మి దంపతుల చేయూత
మిషన్ భగీరథ నీటి సరఫరా లో పంప్ హౌస్ లో సాంకేతిక అంతరాయం