- District News
- తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కా...
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో
బాలికల భద్రతపై అవగాహనతో పాటు సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై అప్రమత్తత అవసరం మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్.
మహబూబాబాద్ పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో బాలికల భద్రత, సైబర్ నేరాల నివారణ, మానవ అక్రమ రవాణా, భరోసా కేంద్రం సేవలు మరియు మహిళా భద్రతపై షీ టీం ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. పి. శబరీష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని షీ టీం ఎస్‌ఐ సునంద మరియు సైబర్ క్రైమ్ ఎస్‌ఐ కరుణాకర్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీం, సైబర్ క్రైమ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU), భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొని విద్యార్థినులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
షీ టీం సేవలు – బాలికలకు భద్రతపై అవగాహన
షీ-టీం ఎస్‌ఐ సునంద గారు షీ టీం విధులు, బాధ్యతలు, షీ టీంను ఏ విధంగా సంప్రదించాలి, షీ టీం సిబ్బంది నిర్వహించే విధులు, మహిళలు మరియు బాలికల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించి, గోప్యతతో ఎలా పరిష్కరిస్తారనే అంశాలను వివరించారు. అలాగే POCSO Act ప్రాముఖ్యత, బాలికల రక్షణకు చట్టపరమైన భద్రత, T-Safe App వినియోగం గురించి అవగాహన కల్పించారు.
విద్యార్థినులు తమ లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణతో, శ్రద్ధగా చదువుకోవాలని, తమ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ సునంద గారు సూచించారు.
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
సైబర్ క్రైమ్ ఎస్‌ఐ కరుణాకర్ గారు వివిధ రకాల సైబర్ నేరాల గురించి విద్యార్థినులకు వివరించారు. ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, సందేశాలు, ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా వ్యక్తిగత వివరాలు, పాస్‌వర్డ్‌లు, OTPలు వంటి సమాచారాన్ని ఎవరికీ వెల్లడించకూడదని, సైబర్ నేరానికి గురైనప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
భరోసా కేంద్రం సేవలపై అవగాహన
భరోసా కేంద్రం సిబ్బంది భరోసా కేంద్రం అందించే సేవలు, విధులు మరియు బాధ్యతల గురించి విద్యార్థినులకు వివరించారు. మహిళలు, బాలికలు ఏవైనా వేధింపులు, హింస లేదా ఇతర సమస్యలకు గురైనప్పుడు భరోసా కేంద్రం ద్వారా పొందగల సహాయం, కౌన్సెలింగ్ మరియు ఇతర సేవల గురించి అవగాహన కల్పించారు.
మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి
యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) సిబ్బంది మానవ అక్రమ రవాణా అంటే ఏమిటి, అది ఏ విధంగా జరుగుతుంది, అక్రమ రవాణాకు గురయ్యే పరిస్థితులు ఏమిటి, దాని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
అనుమానాస్పద వ్యక్తులు లేదా పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు..
బాలికలు చట్టాలపై అవగాహన కలిగి, సైబర్ నేరాలు, ఇతర ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉంటూ, తమ భద్రతతో పాటు సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పోలీస్ అధికారులు పిలుపునిచ్చారు.
ముఖ్యమైన హెల్ప్ లైన్ నెంబర్లు:
అత్యవసర సహాయం: 112 ,
మహబూబాబాద్ షీ టీం నెంబర్: 8712656935 ,
సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్: 1930 ,
చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్: 1098
మహిళ హెల్ప్ లైన్ నెంబర్: 181 ,
600 మంది విద్యార్థినులకు అవగాహన ఈ కార్యక్రమంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ *ఉమామహేశ్వరి మేడం, అధ్యాపక సిబ్బంది,సుమారు 600 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది రమేష్, పార్వతి, సుధారాణి, ప్రియాంక, AHTU సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్ నాయక్, అరుణ, భరోసా సిబ్బంది మౌనిక, బేబీ తదితరులు పాల్గొన్నారు.
