భద్రాచలం ఆల్ పెన్షనర్స్ కార్యాలయం ముందు ఘనంగా జాతీయ పతాకావిష్కరణ 

Published On
భద్రాచలం ఆల్ పెన్షనర్స్ కార్యాలయం ముందు ఘనంగా జాతీయ పతాకావిష్కరణ 

 

భద్రాచలం : లోకల్ గైడ్ న్యూస్ :
 భద్రాచలంలోని పాత ఎల్ఐసీ కార్యాలయం ఎదురుగా ఉన్న టీఏపీఆర్పీఏ (తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్) భద్రాచలం డివిజన్ కార్యాలయ ఆవరణలో శనివారం భారత స్వాతంత్ర్య 80వ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా బందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు తమ జీవితాలను, సుఖాలను త్యాగం చేశారని అన్నారు. వారి పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వారు కలలుగన్న సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ విలువలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ భావితరాలకు మంచి సమాజాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు తమ అనుభవాలను ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చల్లగుండ్ల నాగేశ్వరరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవీఎస్ నారాయణ, డివిజన్ గౌరవ అధ్యక్షులు చండ్ర సుబ్బయ్య చౌదరి, ప్రధాన కార్యదర్శి కేఎస్ఎల్వీ ప్రసాద్, కోశాధికారి డి. కృష్ణమూర్తి, నాళం సత్యనారాయణ, సోంపాక రాజబాబు, వి. సుబ్రహ్మణ్యం, పరిటాల సుబ్బారావు, మురళీకృష్ణ, శివప్రసాద్, నరసింహారావు, కొమరం అలివేణి, బాలమణి, కేఎస్ ప్రభావతి, భాగ్యలక్ష్మి, గండేపల్లి వెంకటరత్నం, డీసీసీ విజయలక్ష్మి, కే. కాంతమ్మ, కే. అన్నపూర్ణదేవి, టి. రాణి, ఆర్. హేమలత, ఎం. సావిత్రి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. 20వ వార్డు మెంబర్ ఇర్ప అనసూయ, డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ టి. సిద్ధులు, డి. సుబ్బరాజు, చింతూరు రిటైర్డ్ ప్రిన్సిపాల్ మాణిక్యాలరావు, రామ్ బ్రహ్మచారి, జీసీసీ కోటేశ్వరరావు, జి. నాగరాజు, రమణ, టి. దాసు, రమణారావు, ఆంజనేయ శాస్త్రి, సీపీఎం నాయకులు గడ్డం స్వామి, పుల్లారావు, చలవాది శ్రీను, బెల్లంకొండ హనుమంతరావు, అక్కయ్య, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమం అనంతరం స్వీట్లు పంచి తేనీటి విందు ఏర్పాటు చేశారు.

Tags:

About The Author

Latest News

హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు హైదరాబాద్‌లో సైబర్ మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్ పేరిట డాక్టర్‌కు రూ. 2.30 కోట్ల టోపి! వాట్సాప్ గ్రూప్, ఫేక్ ఐపీఓ అలకేషన్లతో బురిడీ కొటించిన కేటుగాళ్లు
  ఆగస్టు 29(లోకల్ గైడ్) హైదరాబాద్‌లోని బండ్లగూడ జగీర్‌కు చెందిన 49 ఏళ్ల సర్జన్‌ను ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసగించారు. జులై 2025లో
Toxic Box Office Collection Day 3: తగ్గుతున్న కలెక్షన్లు.. వరల్డ్‌వైడ్‌గా యష్ ‘టాక్సిక్’ సాధించిందెంత?
Google Pixel Watch 5: AI ఆధారిత GPS టెక్నాలజీతో పిన్‌పాయింట్ లొకేషన్ ట్రాకింగ్! గూగుల్ మ్యాప్స్ 3D మోడల్స్, AI సహాయంతో బ్యాటరీ లైఫ్ తగ్గకుండా లొకేషన్ ఆక్యురేసీ
పాకిస్థాన్ బ్యాటింగ్ ఘోర వైఫల్యం: మైఖేల్ వాన్ ఘాటు విమర్శలు! | Pak vs Eng Test కౌంటీ క్రికెట్ స్థాయి కూడా లేదంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆగ్రహం
నేపాల్‌ వరదలు: విదేశీ సహాయక బృందాలకు ఎట్టకేలకు అనుమతి
రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి:
ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు.