- District News
- అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి.
ఎప్పటికప్పుడు గ్రామాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలి.
లోకల్ గైడ్/ తాండూర్:
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశించారు. గురువారం పెద్దేముల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన "మండల స్థాయి సమీక్ష సమావేశంలో" జిల్లా కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గ్రామాల్లో ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను సర్పంచ్‌లు ఎప్పటికప్పుడు సందర్శించి, పాఠశాలల్లోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని, వాటిని నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, విద్య, వైద్యం తదితర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వెంకటేశ్ ప్రసాద్, ఎంపీడీవో తిరుమల స్వామి,అధికారులు,ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
