- District News
- Ranga Reddy
- గాయపడిన బాధితుడికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.30,500 ఆర్థిక సాయం
గాయపడిన బాధితుడికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.30,500 ఆర్థిక సాయం
లబ్ధిదారుడికి చెక్కు అందజేసిన ఏఎంసీ డైరెక్టర్ తాళ్ల రవీందర్
లోకల్ గైడ్
ఆమనగల్లు, ఆగస్టు 13: రంగారెడ్డి జిల్లా
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని సంకటోనిపల్లి గ్రామానికి చెందిన సాటూ విష్ణువర్ధన్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.30,500 ఆర్థిక సాయం మంజూరైంది. ఈ మేరకు మంజూరైన చెక్కును ఏఎంసీ డైరెక్టర్ తాళ్ల రవీందర్ లబ్ధిదారుడికి అందజేశారు.
ఈ సందర్భంగా తాళ్ల రవీందర్ మాట్లాడుతూ, అనారోగ్యం లేదా ప్రమాదాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తన మిత్రుడు, సోదరుడు సాటూ విష్ణువర్ధన్‌కు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందడం పట్ల తాళ్ల రవీందర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
