- District News
- అంకితభావానికి ప్రతిరూపం జోజప్ప.
అంకితభావానికి ప్రతిరూపం జోజప్ప.
విద్యారంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం - ఉపాధ్యాయులందరూ జోజప్పను ఆదర్శంగా తికోవాలి.
లోకల్ గైడ్/ తాండూర్:
విద్యార్థుల భవిష్యత్తే ద్యేయంగా భావిస్తూ.. విధి నిర్వహణలో ఎంతో అంకితభావంతో పనిచేసిన వ్యక్తి జోజప్ప అని మండల విద్యాధికారి నర్సింగ్ రావు కొనియాడారు.గురువారం ఆయన వాలెంటరీ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు,స్థానిక నాయకులు,అభిమానులు తదితరులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం విద్యారంగంలో ఆయన అందించిన సేవలను పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు.
విద్యార్థుల అభ్యున్నతికి చేసిన విశేష కృషి, విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేశారని సహచర ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఆయన తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారని అన్నారు. అంతే కాకుండా సహచర ఉపాధ్యాయులతో సమన్వయంతో పనిచేస్తూ ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి నర్సింగరావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసినప్పుడే విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుందని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదని, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు.
విద్యార్థులను కేవలం పాఠ్యాంశాల్లోనే కాకుండా మంచి విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత కలిగిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. జోజప్ప తన సుదీర్ఘ సేవా కాలంలో విధుల పట్ల నిబద్ధతతో పనిచేసి సహచర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఉపాధ్యాయుడు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
అనంతరం పదవీ విరమణ పొందిన జోజప్ప మాట్లాడుతూ.. తన ఉద్యోగ జీవితంలో విద్యార్థులకు విద్యాబోధన చేయడంతో పాటు వారి భవిష్యత్తు కోసం పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. తన సేవా కాలంలో సహకరించిన ఉన్నతాధికారులు, సహచర ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులకు,స్థానిక నాయకులకు,గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉపాధ్యాయ వృత్తి ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, ప్రతి ఉపాధ్యాయుడు అంకితభావంతో పనిచేసి విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది జోజప్పను శాలువాతో ఘనంగా సత్కరించి ఉదారతను చాటారు.పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ
కార్యక్రమంలో కాంధనేల్లి పాఠశాల జిహెచ్ఎం శివకుమార్, పెద్దేముల్ జిహెచ్ఎం
సునీత,
పిఆర్టియు మండల అధ్యక్షురాలు విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి గోబ్ర్యా నాయక్, ఉపాధ్యాయులు అనిల్, సంతోష్,పాండురంగం,విజయ్ కుమార,శంకర్,వీరేశం, తదితరులు పాల్గొన్నారు.
