- District News
- సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.
సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.
కరస్పాండెంట్ కరుణాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ జయంతి
స్వామి వివేకానంద స్కూల్‌లో రాఖి పౌర్ణమి సందర్భంగా విద్యార్థుల సందడి.
Published On
By Ram Reddy
లోకల్ గైడ్/పతాండూర్:
సోదరభావానికి ప్రతీక రాఖీ పౌర్ణమి అని స్వామి వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ కరుణాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ జయంతి అన్నారు. గురువారం పెద్దేముల్‌లోని స్వామి వివేకానంద స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలను ఏబీవీపీ యువకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని సోదరభావాన్ని చాటుకున్నారు. పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కే. కరుణాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ జయంతి రాఖీ పౌర్ణమి పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. రాఖీ పండుగ సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, రాకేష్ అరవింద్ మణికంఠ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
27 Aug 2026 21:29:06
స్వామి వివేకానంద స్కూల్‌లో రాఖి పౌర్ణమి సందర్భంగా విద్యార్థుల సందడి.
